వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐటీ బాంబే స్టూడెంట్స్‌పై సర్వే: 95 శాతం మంది వర్జిన్‌లే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఐఐటీ బాంబే ఒకటి. ఈ విషయం మనకు తెలిసిందే. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఐఐటీల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక ఎగ్జామ్‌లో మార్కులు సాధించి ఐఐటీల్లో ప్రవేశాన్ని పొందుతారు. అలా క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల బయోడేటాను గురించి తెలుసకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది.

సాధారణంగా క్యాంపస్‌లోకి అడుగు పెట్టిన విద్యార్దులను పేర్లు, వివరాలు, అభిరుచులు గురించి అడిగి తెలుసుకుంటారు. కానీ ఇక్కడ హార్వార్డ్ క్రిమ్ సన్ సర్వే స్పూర్తితో ఐఐటీ-బొంబాయ్స్ న్యూస్ పేపర్ 'ఐఐటీ బాంబే'లో కొత్తగా జాయినైన విద్యార్థులపై ఓ సర్వే చేపట్టింది.

ఈ సర్వేలో అభిరుచులు, లక్ష్యాలతో పాటు, గతంలో సెక్స్ అనుభవం?, క్యాంపస్‌లోకి రాకముందు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి?, మత విశ్వాసాలపై నమ్మకం ఉందా?, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?, హోమో సెక్స్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి సర్వే ఐఐటీ బాంబే చరిత్రలో తొలిసారిగా చేపట్టారు.

95% of IIT-Bombay freshmen are virgins; 75% are 'cheats': Survey

ఈ సర్వేలో 95 శాతం మంది తమకు ఇప్పటివరకు సెక్స్‌ అనుభవం లేదని చెప్పారు. అదే సమయంలో 95 శాతం మంది క్యాంపస్ కు రాకముందు ఎలాంటి సెక్స్ అనుభవం లేదని, తాము వర్జిన్స్ అని తెలిపారు. కేవలం ఐదు శాతం మంది మాత్రమే సంబంధాలు కలిగి ఉండడం విశేషం.

30 శాతం మంది మాత్రం తాము వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అంగీకరించారు. అలాగే 75 శాతం మంది హోమ్‌ సెక్సువాలిటీకి అనుకూలంగా మాట్లాడారు. 60 శాతం మంది విద్యార్థులు అసలు మతాలను నమ్మడం లేదని తేలింది. కేవలం 30 శాతం మంది మాత్రమే దేవున్ని నమ్ముతున్నామని చెప్పారు.

రాజకీయాల పట్ల మాత్రం చాలా మంది మద్యస్థంగా ఉండిపోయారు. ఫస్ట్ సెమిస్టర్ వరకు జాగ్రత్తగా ఉన్న విద్యార్థులు ఫస్ట్ సెమ్ ముగిశాక ఫేస్‌బుక్‌లో రోజుకు 1.6 గంటలు గడుపుతున్నట్టు తెలిపారు. రోజుకు 1.4 గంటలు చదువుకు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.

ఈ సర్వే అనంతరం పాశ్చాత్య దేశాల్లో స్కూలింగ్ సమయంలోనే గర్భవతులవుతుండగా, భారత్‌లో గ్రాడ్యుయేషన్ వరకు ఆగడం శుభసంకేతమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘క్యాంపస్‌కి వస్తున్న విద్యార్ధుల మనస్తత్వాలను గురించి అధ్యయనం చేయడానికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంద'ని ఎడిటర్‌ శ్రేయస్‌ మీనన్‌ వ్యాఖ్యానించారు.

English summary
Fee hike at Indian Institute of Technology (IITs) across India has recently been criticized and debated upon by many. But if IIT – Bombay’s ‘freshmen survey’ is to be believed, 95.9% of the candidates have taken coaching to enter premier technology institutes of the country and 47% have paid around 2.5lakh for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X