వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే సత్యాలు: ఆఫీసుల్లో బాస్‌కు ఉద్యోగస్తులు గ్రేడింగ్ ఎలా ఇచ్చారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఆఫీసుల్లో ఎంప్లాయిస్‌కు బాసులు ఒక పనిని లేదా టాస్క్‌ను పూర్తి చేయాలని ఆదేశిస్తారు. ఎంప్లాయిస్ మూడ్ బాగుంటే బాస్‌ను పొగిడేస్తారు. లేదంటే అది వేరుగా ఉంటుంది. చాలామంది ఎంప్లాయిస్ తమ బాసులు చేసే పనిని తామే మరింత సమర్థవంతంగా చేయగలమనే కాన్ఫిడెన్స్‌నువ్యక్తం చేస్తున్నారని ఫ్యూచర్ వర్క్‌ప్లేస్ సర్వే పేర్కొంది. గతేడాది జూలై 31 నుంచి ఆగష్టు 9 వరకు ఈ సర్వే నిర్వహించింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యూకే, యూఎస్ దేశాల్లో 3వేల మంది ఉద్యోగస్తులను కలిసి కొన్ని ప్రశ్నలు వేసింది.

 బాస్‌లు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి

బాస్‌లు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి

సర్వేలో సమాధానాలను బట్టి గ్రేడింగ్ విధానం సీ, డీ, ఎఫ్ ఇచ్చారు. ముగ్గురు ఉద్యోగస్తుల్లో ఒకరు తమ బాస్ ఉద్యోగంను అదే సమయంలో వ్యక్తిగత జీవితంను బ్యాలెన్స్ చేసుకోవాలని 37శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఉద్యోగంలో బాస్‌లు మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని మరో 37శాతం మంది చెప్పారు. మరికొందరు బాస్ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన విషయాల్లో మెరుగుపడాల్సి ఉందని చెప్పగా మరో 33శాతం మంది తమ బాసులు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఉద్యోగస్తులు బాస్‌లకు ఇచ్చిన గ్రేడింగ్

ఉద్యోగస్తులు బాస్‌లకు ఇచ్చిన గ్రేడింగ్

ఉద్యోగస్తులను మేనేజ్ చేసే విషయంలో 26శాతం మంది తమ బాసులకు గ్రేడ్ ఏ ఇవ్వగా.. 37శాతం మంది గ్రేడ్ బీ ఇచ్చారు. 25శాతం మంది గ్రేడ్ సీ ఇవ్వగా.. కొందరు ఏకంగా తమ బాస్‌ల పనితీరు బాగాలేదని ఎఫ్ గ్రేడ్ ఇచ్చారు. ఇక భారతీయ ఉద్యోగస్తులు మాత్రం తమ బాసుల పనితీరుతో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి 10 మంది భారతీయ ఉద్యోగుల్లో 8 మంది తమ బాసులకు గ్రేడ్‌ ఏ లేదా గ్రేడ్ బీ స్థానం ఇచ్చారు. ఫ్రెంచ్, జర్మనీ, యూకే దేశాలకు చెందిన ఉద్యోగస్తులు మాత్రం తమ బాసు పనితనం పట్ల నిరాశతో ఉన్నారు. ప్రతి కేటగీరీలో ఈ దేశాలకు చెందిన ఉద్యోగస్తులు తమ బాసులను చివరి మూడు స్థానాలకే పరిమితం చేశారని సర్వే వెల్లడించింది.

బాస్‌లు పనితీరు బాగుందని చెప్పిన భారతీయ ఉద్యోగస్తులు

బాస్‌లు పనితీరు బాగుందని చెప్పిన భారతీయ ఉద్యోగస్తులు

తమ మేనేజర్‌కు 95శాతం మార్కులు వేసినప్పటికీ భారతీయు ఉద్యోగస్తులు మాత్రం తమ బాసులు ఇంకా వారి పనితీరును మెరుగుపర్చుకోగలరని చెప్పారు. ఇక బాసులు పనితీరు అద్భుతంగా ఉందని చెప్పిన ఉద్యోగస్తుల జాబితాలో 87శాతంతో మెక్సికో, 71శాతంతో ఫ్రాన్స్ ఎంప్లాయిస్ ఉన్నారు. కెనడా దేశానికి చెందిన 61శాతం మంది ఉద్యోగస్తులు తమ బాస్ పనితీరు బాగుందని చెప్పగా అమెరికాలో మాత్రం 59శాతం మంది ఉద్యోగులు తమ బాస్‌లకు ఓటువేశారు.

English summary
Even as bosses worldwide, including in India, are well regarded by their employees, most of these same employees think they could personally manage even more effectively do their managers' job, according to a survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X