వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

96కి చేరిన స్ట్రెయిన్ కేసులు.. ఇవాళ మరో ఆరుగురికి...

|
Google Oneindia TeluguNews

కరోనా స్ట్రెయిన్.. పేరు చెబితేనే జనం భయాందోళనకు గురవుతున్నారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్.. ఇతర దేశాలకు పాకింది. అయితే భారత్‌లో ఇలాంటి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం మరో ఆరు స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయి. దీంతో స్ట్రెయిన్ కేసుల సంఖ్య 96కి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా స్ట్రెయిన్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నామని వివరించింది. శనివారం స్ట్రెయిన్ కేసులు 90 కాగా.. ఆదివారం ఒక్క కేసు కూడా రాలేదు. అయితే సోమవారం మరో ఆరు కేసులు వచ్చాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు తెలిపారు. స్ట్రెయిన్ మరింత స్ప్రెడ్ కాకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

96 infected corona strain in india

బ్రిటన్ నుంచి తొలుత విమానాలు నిలిపివేయగా.. ఈ నెల 8వ తేదీ నుంచి కొన్ని ప్లైట్లను మాత్రమే అనుమతించింది. అయితే అక్కడి నుంచి వచ్చేవారికి విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేస్తోంది. ఒకవేళ లక్షణాలు ఉంటే బయటకు పంపించడం లేదు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తోంది. ఇన్నీ నిబంధనలు పెట్టినా.. కఠిన చర్యలు తీసుకున్నా స్ట్రెయిన్ కేసులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు తెలుపగా.. అదీ వ్యాప్తి చెందేదానిని బట్టి నిజమని అర్థమవుతోంది.

English summary
96 people infected corona strain in india. monday 6 members infect strain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X