వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 963 మందిని మట్టుబెట్టామన్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని కేంద్రం ప్రకటించింది. 2014 జూన్ నుంచి ఇప్పటివరకు 963 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నది. ఏ రూపంలోనైనా తీవ్రవాదాన్ని సహించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఉగ్రవాదుల మట్టుబెట్టిన అంశానికి సంబంధించి ఇవాళ పార్లమెంట్‌కు అమిత్ షా లిఖితపూర్వకంగా వివరించారు.

413 మంది సైనికుల వీరమరణం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్లమెంట్‌కు తెలిపారాయన. అయితే ఉగ్రవాద నియంత్రణ చర్యల్లో భాగంగా 413 మంది సైనికులు వీరమరణం పొందినట్టు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆసువులు బాసిన సైనికుల కుటుంబాల కోసం సంక్షేమ అధికారులను నియమించారని పేర్కొన్నారు. వారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను అందిస్తారని వెల్లడించారు. వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి పిల్లలకు విద్య, కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటన చేశారు అమిత్ షా.

963 terrorist dead in 5 years says amith shah

అంతకుముందు పార్లమెంట్‌కు ప్రభుత్వం బాలాకోట్ దాడుల తర్వాత జరిగిన మార్పునకు సంబంధించిన నివేదికను అందజేసింది. ఇందులో ఇటీవల జరిపిన బాలాకోట్ దాడులను ప్రస్తావించింది. దీంతో చొరబాటుదారుల సంఖ్య 43 శాతం తగ్గిందని పేర్కొన్నది. భద్రతా బలగాలు తీసుకుంటున్న పటిష్ట చర్యల ఫలితంగా .. దేశంలో ఉగ్రవాద చర్యలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. ఇక శాంతి భద్రతల విషయానికొస్తే .. ఈ జూన్ నాటికి కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు.

English summary
The Center has announced that it is pushing terrorists. A total of 963 terrorists have been killed since June 2014. Union Home Minister Amit Shah has made it clear that he will not tolerate terrorism in any form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X