వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

99 ఏళ్ల ముంబై బామ్మకు సెల్యూట్: నెటిజన్లు ఫిదా.. హృదయాన్ని కదలించిందని అంటూ...(వీడియో)

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏళ్ల బామ్మ. ఆ వృద్దురాలు వలసకూలీల కోసం రోటీ, సబ్జీ ప్యాక్ చేసి అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆమె మేనల్లుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ వైరలైంది. వృద్దురాలిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Recommended Video

#Watch : 99 Year Old Woman Packing Food For Migrant Workers

వలసకూలీల కోసం వృద్దురాలు రోటీ, సబ్జీ కవర్లలో చుడుతన్న వీడియోను ఆమె మేనల్లుడు జహీద్ ఎఫ్ ఇబ్రహీం పోస్ట్ చేశారు. అతను కరాచీలో సుప్రీంకోర్టు లాయర్ అని తన బయోగ్రఫీలో రాసుకొన్నారు. నా 99 ఏళ్ల అత్త ఫుడ్ ప్యాకేట్లు సిద్దం చేస్తుంది అని రాశారు. ఆ ట్వీట్‌కు తెగ వైరలవుతోంది. 1300 సార్లు షేర్ చేయగా, 11 వేల 500 లైకులు వచ్చాయి. ఆ వీడియో తన హృదయాన్ని కదలించింది అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

99-year-old Woman Packing Food for Migrant Workers in Mumbai..

దేశం సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో మహిళ తన దాతృత్వాన్ని చాటారు. తనకు తోచిన సాయం చేస్తూ.. కూలీల కడుపు నింపుతున్నారు. కరోనా వైరస్ విజృంభించడంతో దేశంలో మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే సడలింపులు ఇస్తోన్న.. వలసకూలీల సమస్య మాత్రం తగ్గడం లేదు. కొందరు నడుచుకుంటూ వెళుతూ ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు ట్రక్కులలో ప్రయాణిస్తూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.

English summary
99-year-old woman packing food for migrant workers is a testimony to this. rolling rotis with sabzi in a foil sheet meant for migrant workers stuck in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X