వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగరెట్లు తెచ్చివ్వలేదని బాలుడ్ని చంపేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

నాసిక్: సిగరెట్లు తీసుకురావడానికి నిరాకరించాడని బాలుడిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ర్టలోని నాసిక్ లో నివాసం ఉంటున్న శాలిగ్రామ్ అనే ఆయన కుమారుడు గోలు అలియాస్ విశాల్ భలేరావు (13) అనే బాలుడు హత్యకు గురైనాడు.

శాలిగ్రామ్ ఫ్లంబర్ పని చేస్తున్నాడు. విశాల్ 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో విశాల్ నిర్జనప్రదేశంలో అర్దనగ్నంగా శవమై కనిపించాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

a 13-year-old boy killed in Nashik

పోలీసులు హత్యకు గురైయ్యింది విశాల్ అని గుర్తించారు. పోలీసులు విశాల్ తండ్రి శాలిగ్రామ్ ను విచారణ చేశారు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు నాలుగు రోజుల క్రితం సిగరెట్లు తీసుకురావాలని చెప్పారని, అందుకు విశాల్ నిరాకరించాడని పోలీసులకు చెప్పాడు.

ఇదే విషయంపై తాను ఆ ఇద్దరు యువకులతో గొడవ పడ్డానని సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. పోస్టుమార్టుం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
The half-naked body of Golu alias Vishal Bhalerao was found with his face bludgeoned around 11.30am on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X