వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య, కేసు క్లోజ్ కు డీస్పీ స్కెచ్. టోల్ ఫ్రీ నెంబర్ తో, ధర్నా!

|
Google Oneindia TeluguNews

ధర్మపురి (తమిళనాడు): ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను నిర్బంధించి సామూహిక అత్యాచారం చెయ్యడంతో ఆమె చికిత్స విఫలమై మృతిచెందిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగింది. ధర్మపురిలోని ఆరూర్ చిక్లింగ్ ప్రాంతానికి చెందిన అన్నామలై, మలర్ దంపతుల కుమార్తె సౌమ్య (17) అనే ఆదివాసి బాలిక మరణించిందని సోమవారం పోలీసులు చెప్పారు. కేసు క్లోజ్ చెయ్యడానికి డీస్పీ స్థాయి అధికారి ఒత్తిడి తీసుకువస్తున్నాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పాపిరెడ్డి ఊరిలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో నివాసం ఉంటున్న సౌమ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల సౌమ్య హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది. ఇంటిలో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో సమీపంలోని పొదల్లో బహిర్భూమికి సౌమ్య వెళ్లింది.

A 17-year-old Adivasi girl who was allegedly raped by two men at a village in Tamil Nadu

ఆ సందర్బంలో కామాంధులు సౌమ్యను బలవంతంగా లాక్కొని వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. సౌమ్య ఎంతసేపటికి ఇంటికి రావడంతో ఆమె తల్లి మలర్ సమీపంలోని పొదల దగ్గరకు వెళ్లింది. అపాస్మారక స్థితిలో పడిఉన్న సౌమ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.

చివరికి ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని లోల్ ఫ్రీ నెంబర్ కు సౌమ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు స్పంధించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య తన గ్రామానికి చెందిన రమేష్, సతీష్ అనే ఇద్దరు బలవంతంగా లాక్కెళ్లారని, తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వదలకుండా తన మీద అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది.

సౌమ్యకు చికిత్స చేసిన తరువాత ఆమెను సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆరోగ్యం మళ్లీ క్షిణించడంతో సౌమ్యను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సౌమ్య మరణించిదని పోలీసులు అన్నారు. నిందితులను రక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారి తమను బెదిరిస్తున్నాడని సౌమ్య తండ్రి అన్నామలై ఆరోపించారు.

గ్రామంలోని కొందరు పెద్దలు కేసు లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. వెనుక బడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ధర్మపురి జిల్లా మొత్తం ఆందోళన చేస్తున్నాయి. నిందితులు ఎంతటి వారైనా వెంటనే అరెస్టు చెయ్యాలని పీఎంకే నేత, ధర్మపురి ఎంపీ అన్బుమణి రాందాస్ డిమాండ్ చేస్తున్నారు.

English summary
A 17-year-old Adivasi girl who was allegedly raped by two men at a village in Tamil Nadu last week, died in a hospital, triggering protests by her family, alleging that there was a delay in accepting their complaint and nabbing the accused. Police nabbed criminal Sathish, Hunting on for Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X