పెళ్లికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, లాడ్జ్ లో చెయ్యి కోసుకున్న లేడీ టెక్కీ, పోలీసులకు ఫోన్ చేసి !
బెంగళూరు: ప్రియుడు మోసం చేశాడని జీవితంపై విరక్తి పెంచుకున్న లేడీ టెక్కీ బలేడ్ తో చెయ్యికోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. రక్తం ఎక్కువ పోవడంతో భాదితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
ఎస్ఎస్ రాజమౌళి ఈగ ఫేం సుదీప్ కు అరెస్టు వారెంట్ జారీ, షూటింగ్ సమయంలో ఆస్తి నష్టం !
కర్ణాటకలోని బాగల్ కోటేకు చెందిన యువతి (23) ెంగళూరు చేరుకుని బీటీఎం లేఔట్ లో పీజీలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నది. ఈమె బెంగళూరులో రెండు సంవత్సరాల నుంచి ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నది.
ఉద్యోగం చేస్తున్న యువతికి ఓ యువకుడితో పరిచయం పెరిగింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని యువతి చెప్పడంతో యువకుడు నిరాకరించాడు. పెళ్లి చేసుకోనని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ యువకుడు ఎదురుతిరిగాడని సమాచారం.
సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్ ట్యాపింగ్, ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా!
ప్రేమించిన యువకుడు మోసం చెయ్యడంతో తట్టుకోలేని యువతి జీవితంపై విరక్తి పెంచుకుంది. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో మూర్తినగరలోని ఓలాడ్జ్ లో యువతి గది అద్దెకు తీసుకుంది. తరువాత బ్లేడ్ తో చెయ్యికోసుకున్న యువతి రక్తం ఎక్కువపోవడంతో నోప్పి తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే లాడ్జ్ దగ్గరకు చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాు బెంగళూరు చేరుకున్నారు. యువతి వివరాలు చెప్పడానికి ఆమె కుటుంబ సభ్యులు వెనకడుగు వేస్తున్నారని, చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.