వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగంలో విసుగు...! కేజ్రీవాల్ టార్గెట్... సీఎంకు బెదిరింపు మెయిల్స్ పెట్టిన యువకుడు, అరెస్ట్...!

|
Google Oneindia TeluguNews

మధ్యలో చదువు మానేశాడు.అనంతరం ఓ ఫర్నిచర్ షాపులో డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయానే మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో నిలకడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎదో ఒక సంచలనం చేయాలని భావించాడు.ఇంకేముందు అనుకున్నదే తడవుగా ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేశాడు. చంపి వేస్తానని బెదిరింపు ఈ మేయిల్ చేశాడు. అంతకు ముందు ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బాంబు ఉందంటూ ఫోన్ సైతం చేశాడు. అయితే బెదిరింపు కాల్స్‌పై కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు.

ముంబాయికి చెందిన అభిషేక్ తివారి అనే 28 ఏళ్ల యువకుడు చదువు మానేసీ ఓ ఫర్నీచర్ షాపులో డెలివరి బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే అభిషేక్ తన ఉద్యోగంలోని వేధింపులకు గురయ్యాడు. అనంతరం విసుగు చెందాడు. దీంతో ఆందోళనలకు గురైన అభిషేక్ అనుచితంగా వ్యవహరించాడు. ప్రజలను భయాందోళనలకు గురి చేయాలని నిర్ణయించాడు. ముందుగా తన మొబైల్ నుండి ముంబయిలోని మున్సిపల్ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ పెట్టాడు. అయితే ఆ మెయిల్‌తో ఎలాంటీ స్పందన లేకపోవడంతో లాభం లేదనుకున్న అభిషేక్ ప్రముఖులను టార్గెట్ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని భావించాడు. దీంతో ఏకంగా ఢీల్లీలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ చేశాడు.

A 28 year old man threat emails to Delhi chief minister Arvind Kejriwal

అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సైతం బెదిరింపు ఈ మెయిల్స్ పంపాడు. జూలై 25 ఓసారి పంపిణ అభిషేక్, మరోసారి జూలై 30న మరోసారి ఢిల్లీ కార్యాలయానికి మెయిల్ పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ ప్రత్యేక పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అనంతరం అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. కాగా అభిషేక్ మెయిల్స్ వెనక ఇంకా ఎవరైన ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్స్ పరంగా సాంకేతిక పరిజ్ఝానంపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
A 28 year old man from Mumbai has been arrested for sending threat emails to political leaders including Delhi chief minister Arvind Kejriwal, email threatening a bomb attack at the headquarters of a national political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X