బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆఫీస్ మీద నుంచి కిందకుదూకి సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య, ఆరు నెలల నుంచి ఆవేదన!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) భవనం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అమలాన్ బర్మన్ (31) అనే టెక్కీ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

బెంగళూరు చేరుకున్న అమలాన్ బర్మన్ తల్లితో కలిసి మహదేవపుర సమీపంలో నివాసం ఉంటూ బాగ్మనే టెక్ పార్క్ లోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి నుంచి బాగ్మనే టెక్ పార్క్ లోని కార్యాయాలనికి వెళ్లారు.

A 31 year old techie Amlan committed suicide

మద్యహ్నం భోజనం చేసిన తరువాత అమలాన్ బర్మన్ పని చేస్తున్న కార్యాలయం కట్టడం మీదకు వెళ్లి కిందకుదూకేశాడు. విషయం గుర్తించిన సాటి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలైన అమలాన్ బర్మన్ మరణించాడని పోలీసులు అన్నారు. అమలాన్ బర్మన్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

అమలాన్ బర్మన్ స్నేహితులు, కార్యాలయం సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆరు నెలల నుంచి అమలాన్ బర్మన్ మానసికంగా కుంగిపోయారని, ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని అతని తల్లి చెప్పారని, కేసు విచారణలో ఉందని మహదేవపుర పోలీసులు తెలిపారు.

English summary
Karnataka : A 31 year old techie Amlan committed suicide by jumping off from her office building in Mahadevapura of Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X