బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరెంట్ పోయిందని, ఫ్యూజ్ రెడీ చెయ్యాలని ఎలక్ట్రీషియన్ ను ఫోన్ చేసి పిలిస్తే మహిళ మీద అత్యాచారయత్నం చేసి కటకటాలపాలైన ఘటన బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూండ్లులో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ మహిళ మీద అత్యాచారయత్నం చెయ్యడంతో కామాంధుడిని జైలుకు పంపించారు.

మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !

కూండ్లోలో ఇల్లు

కూండ్లోలో ఇల్లు

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలోని కూండ్లు ప్రాంతంలో రామ్ కుమార్ యాదవ్ (35) అనే ఎలక్ట్రీషియన్ నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుటుంభానికి చెందిన భవనం ఎలక్ట్రీషియన్ పనులు రామ్ కుమార్ యాదవ్ చూసుకుంటున్నాడు.

భారీ వానకు కరెంట్ కట్

భారీ వానకు కరెంట్ కట్

రాత్రి 10.30 గంటల సమయంలో విపరీతమైన వానలతో ఆ మహిళ ఇంట్లో కంరెట్ పోయింది. ఫ్యూజ్ పోయి ఉంటుందని, వచ్చి మరమత్తులు చెయ్యాలని ఆ మహిళ రామ్ కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి చెప్పింది. మహిళ ఇంటికి వెళ్లిన రామ్ కుమార్ యాదవ్ కొంత సేపటికి కరెంట్ ఫ్యూజ్ రెడీ చేశాడు.

ఇదే మంచి చాన్స్

ఇదే మంచి చాన్స్

మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నదని గుర్తించిన రామ్ కుమార్ యాదవ్ బయటకు వెళ్లే నెపంతో ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. తాను కేకలు వేస్తానని, మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని ఆ మహిళ హెచ్చరించినా రామ్ కుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు వచ్చి రామ్ కుమార్ యాదవ్ ను పట్టుకుని చితకకబాది పోలీసులకు అప్పగించారు.

జైల్లో చిప్పకూడు

జైల్లో చిప్పకూడు

పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడు రామ్ కుమార్ యాదవ్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఎప్పుడు పిలిచినా వచ్చి మహిళ ఇంట్లో విద్యుత్ తీగల సమస్యలు పరిష్కరించే రామ్ కుమార్ యాదవ్ ఆమె ఒంటరిగా ఉన్న విషయం గుర్తించి అత్యాచారయత్నం చేశాడని, అతన్ని జైలుకు పంపించామని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు.

English summary
Bengalugu: A 35 year old Electrician arrested by Parappana agrahara police for Allegedly attempting to assault Woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X