చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీబీసీలో కథనం: 'భారత న్యాయవ్యవస్ధకు ఏడు చీకటి రోజులు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఈ వారం రోజులు భారత న్యాయవ్యవస్ధకు చెడ్డ రోజులంటూ బీబీసీ ఇండియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. నేర పూరిత చర్యలతో కోర్టులో జైలు శిక్ష పడింది వాళ్లకి. ఒకరు ప్రముఖ హీరో, మరొకరు బడా పారిశ్రామిక వేత్త, ఇంకొకరు దేశ రాజకీయాలను శాసించే సత్తా ఉన్న మహిళా రాజకీయ నేత వీరంతా వారం రోజుల వ్యవధిలో శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నారు.

వీరికి ఎలాంటి శిక్ష పడుతుందోనని యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. చట్టం ముందు ఎంతటివారైనా సమానమేనని ఆనందిస్తోన్న వేళ వేరు వేరు కోర్టులు వీరిని శిక్షలను కొట్టేస్తూ తీర్పునిచ్చాయి.

వారెవరో కాదు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యం రామలింగరాజు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో 13 ఏళ్ల పాటు విచారణ జరిపిన సెషన్స్ కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తే, హైకోర్టు కింది న్యాయస్ధానం తీర్పు చెల్లదంటూ సస్పెన్షన్ తెచ్చుకున్నారు.

A bad seven days for Indian justice

ఇక ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో 18 ఏళ్ల విచారణ అనంతరం జయలలితకు శిక్ష పడింది. బెయిల్‌పై విడుదలైన జయలలిత కేసుని మొన్నటికి మొన్న కర్ణాటక హైకోర్టు ఆమె అక్రమాస్తులు 8 శాతం మాత్రమే ఉన్నాయంటూ కేసుని కొట్టేస్తూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.

కార్పోరేట్ రంగాన్నే ఒక కుదుపుకుదిపిన సత్యం స్కామ్‌లో జైలు శిక్షను అనుభవిస్తూ రామలింగరాజు బెయిల్‌పై విడుదలయ్యారు. వీరితో పోలిస్తే మన దేశంలో చిన్న చిన్న నేరాలు చేసిన ఎంతో మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో చాలా మందికి బెయిల్ లభించినా, అందుకోసం చెల్లించాల్సిన రూ. 5 వేలు, రూ. 10 వేలు చెల్లించలేని స్ధితిలో జైళ్లలోనే ఉండిపోతున్నారు.

భారత్‌లో నీతిమంతులైన జడ్జిలు ఉన్నా, రాజకీయ ప్రలోభాలు, డబ్బుకు లొంగే జడ్జిలు వేరే కోర్టుల్లో ఉండటం అవినీతి పరులకు ఎంతో లాభం కలుగుతుందోని హార్వర్డ్ లా స్కూల్లో చదువుతూ, భారత న్యాయ వ్యవస్ధపై అధ్యయనం చేస్తోన్న నిక్ రాబిన్సన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

English summary
In three separate cases, high profile and influential individuals - a Bollywood star, a powerful politician, and a former business baron - were allowed to walk free by appeals court despite being found guilty by lower courts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X