వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

67కు పైగా పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం; అశ్లీలంపై భారత్ ఉక్కుపాదం!!

|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అశ్లీల విషయాలను కలిగి ఉన్న 67 కు పైగా వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్, 2021ని ఉల్లంఘించినందుకు, రెండు హైకోర్టులు జారీ చేసిన తీర్పుల ఆధారంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.

63 పోర్న్ వెబ్ సైట్లు బ్యాన్ చెయ్యాలని కేంద్రం ఆదేశం

63 పోర్న్ వెబ్ సైట్లు బ్యాన్ చెయ్యాలని కేంద్రం ఆదేశం


ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు జారీ చేసిన నాలుగు లేఖలలో, పూణే కోర్టు ఆదేశాల ఆధారంగా 63 వెబ్‌సైట్‌లు మరియు ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క 2018 తీర్పు మరియు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ఆధారంగా 67 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని టెలి కమ్యూనికేషన్ విభాగం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లను కోరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 3(2)(బి)తో పాటుగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వుకు అనుగుణంగా కొన్ని అశ్లీల వెబ్ సైట్ లను , మహిళల యొక్క ఆత్మ గౌరవం దృష్ట్యా వెంటనే తొలగించాలని పేర్కొంది.

యూఆర్ఎల్ ను తక్షణమే తొలగించాలని ఆదేశం

యూఆర్ఎల్ ను తక్షణమే తొలగించాలని ఆదేశం

వెబ్‌సైట్‌లు, యూఆర్ఎల్ ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 నాటి టెలి కమ్యూనికేషన్ విభాగం తన ఆదేశాల్లో పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు హోస్ట్ చేసిన, నిల్వ చేసిన లేదా ప్రచురించిన అశ్లీల కంటెంట్‌కు యాక్సెస్‌ను తీసివేయడం లేదా నిలిపివేయడం చేయాలని పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఉదహరించిన నిబంధన సాధారణంగా వ్యక్తి యొక్క అనుమతి లేకుండా పోస్ట్ చేయబడిన ప్రతీకార అశ్లీల సందర్భాలలో వర్తిస్తుంది. ఈ సైట్‌లలో వ్యక్తిగత చిత్రాలు పోస్ట్ చేయబడిన నిర్దిష్ట వ్యక్తుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా ఎటువంటి అశ్లీల కంటెంట్ వెబ్ సైట్ లో ఉన్నా తొలగిస్తుందా అనేదానిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు.

గతంలోనూ పోర్న్ వెబ్ సైట్ లపై బ్యాన్.. మళ్ళీ ఇప్పుడు పోర్న్ సైట్ లపై ఉక్కుపాదం

గతంలోనూ పోర్న్ వెబ్ సైట్ లపై బ్యాన్.. మళ్ళీ ఇప్పుడు పోర్న్ సైట్ లపై ఉక్కుపాదం

2015లో, ప్రజల నిరసనల నేపధ్యంలో 800 కంటే ఎక్కువ అశ్లీల వెబ్‌సైట్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఆ సైట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా ఉన్నాయి. కోర్టు నిషేధాన్ని స్పష్టంగా ఆదేశించనప్పటికీ, అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను సైట్‌లను తొలగించాలని ఆదేశించింది. తర్వాత ప్రభుత్వం చైల్డ్ పోర్న్‌ను మాత్రమే నిరోధించాల్సిన అవసరం ఉందని మిగతా సైట్లపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక ప్రస్తుతం మరోమారు భారత ప్రభుత్వం అశ్లీల వెబ్‌సైట్‌లపై ఉక్కుపాదం మోపే క్రమంలో 67కుపైగా అశ్లీల వెబ్ సైట్లపై బ్యాన్ విధించింది.

English summary
Center has banned more than 67 porn websites. This decision was taken in the course of India's crackdown on obscenity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X