వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద పొంగులో టిక్‌టాక్.. ప్రాణం పోయిందిగా భాయ్‌సాబ్..!

|
Google Oneindia TeluguNews

పాట్నా : టిక్‌టాక్ వీడియోల సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని పోని ఫీట్లు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇటీవల ఈ టిక్కుటాక్కుల గోలతో ఉద్యోగాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

టిక్‌టాక్ వీడియోలు ఎంత పేరు తెస్తున్నాయో, ఎన్ని లైకులు ఇస్తున్నాయో తెలియదు గానీ ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. అనవసరంగా రిస్క్ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. మరికొందరైతే స్టంట్లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో కొత్త రకంగా వీడియో తీద్దామని తలచి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీభత్సమైన వరద ఉద్ధృతిలో టిక్‌టాక్ వీడియో తీస్తూ చనిపోయిన ఘటన వెలుగుచూసింది.

మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు.. ఫోన్ చేసి కొట్టేస్తున్నారు..!మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు.. ఫోన్ చేసి కొట్టేస్తున్నారు..!

a boy died after drowning in a stream of floodwater while tiktok video
a boy died after drowning in a stream of floodwater while tiktok video

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్‌లో వరదలొచ్చాయి. అయితే అద్లావ్‌ పూర్‌ ప్రాంతానికి చెందిన అఫ్జల్‌ మూడు రోజుల కిందట తన స్నేహితులతో కలిసి వరద నీటిలో టిక్‌టాక్‌ వీడియో చేశాడు. మొదట ఓ బాలుడు డైవ్‌ చేయగా అనంతరం అఫ్జల్‌ కూడా దూకాడు. కొంతదూరం ఈదుకుంటూ వెళ్లిన తర్వాత వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అఫ్జల్‌ కొట్టుకుపోయాడు. దాంతో అలర్టైన ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అదలావుంటే మూడు రోజుల తర్వాత అఫ్జల్ డెడ్‌బాడీని శుక్రవారం నాడు బయటపడింది.

English summary
Some Boys made selfie videos in heavy floods cause to one death. A boy drowned here yesterday allegedly while recording a TikTok video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X