• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెళ్లి కొడుకు నాట్ రీచబుల్, పెళ్లికి ముందే ఇలా చేస్తే తరువాత ఏం చేస్తాడు, పెళ్లి కుమార్తె !

|

బెంగళూరు: పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు మొబైల్ ఫోన్ నాట్ రీచబుల్ అయ్యింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురైనారు. పెళ్లికి ముందే ఇలా చేసిన పెళ్లి కుమారుడు పెళ్లి తరువాత ఏం చేస్తాడో ? అంటూ పెళ్లి కుమార్తె అనుమానం వ్యక్తం చెయ్యడంతో పెళ్లి పెద్దలు పోలీసులను ఆశ్రయించారు.

యువకులతో లింక్, జల్సాలు, భర్త పెట్రోల్ బంక్ యజమాని, కిడ్నాప్ చేయించి భార్య నాటకాలు!

 బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులో ఉద్యోగం

కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర బళ్కూరులో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉడిపి జిల్లాలోని బైందూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతితో ప్రవీణ్ కుమార్ వివాహం చెయ్యాలని పెద్దలు నిశ్చయించారు.

 పెళ్లి డేట్ ఫిక్స్

పెళ్లి డేట్ ఫిక్స్

నాలుగు నెలల క్రితం ప్రవీణ్ కుమార్, యువతి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 29వ తేదీ ప్రవీణ్ కుమార్, యువతి వివాహం చెయ్యాలని పెద్దలు తేదీ ఫిక్స్ చేశారు. ప్రవీణ్ కుమార్, యువతి కుటుంబ సభ్యులు పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.

 పెళ్లి టైంకి వచ్చేస్తా !

పెళ్లి టైంకి వచ్చేస్తా !

నవంబర్ 26వ తేదీ తాను బెంగళూరు నుంచి బయలుదేరి ఇంటికి వస్తానని ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే బెంగళూరు నుంచి బయలుదేరిన ప్రవీణ్ కుమార్ ఇంటికి చేరుకోలేదు. ప్రవీణ్ కుమార్ మొబైల్ ఫోన్ కు అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు.

వరుడు నాట్ రీచబుల్

వరుడు నాట్ రీచబుల్

ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తోంది. కనీసం ముహుర్తం సమయానికి అయినా వస్తాడని అందరూ భావించారు. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం మాయం అయ్యాడు. పెళ్లి పీటల మీద వివాహం నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు.

 పెళ్లి తరువాత ఏం చేస్తాడు ?

పెళ్లి తరువాత ఏం చేస్తాడు ?

పెళ్లికి ముందే ఇలా తప్పించుకుని తిరుగుతున్న ప్రవీణ్ కుమార్ పెళ్లి తరువాత తనను ఎలా చూసుకుంటాడో అంటూ పెళ్లి కుమార్తె ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లి కుమారుడు మాయం కావడంతో పోలీసులు పంచాయితీ చేశారు. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు అయిన ఖర్చు పైసాలతో సహ చెల్లించడానికి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు శాంతించారు. ఇటీవల రామనగరలో గుర్తు తెలియన వ్యక్తి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పెళ్లి కొడుకుకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, భార్య, పిల్లలు ఉన్నారని చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే.

English summary
Bengaluru: A boy who is supposed to be married is missing and marriage cancelled in Bainduru in udupi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X