వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రికి ఓ తండ్రి లేఖ: ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే కూతురు ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తన కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్య తీసుకోవాలంటూ కన్నీటితో ఓ కన్న తండ్రి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశాడు. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ తప్పకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.... 17 ఏళ్ల కమిలిక దాస్ కోల్‌కత్తా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 11వ తరగతి చదువుతోంది. నాలుగేల్ల కింద ఆమె చదివే స్కూల్‌లోనే తోటి విద్యార్ధి ఒకరు తనని లైంగికంగా వేధించాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి స్కూలు యాజమాన్యానికి విద్యార్థిపై ఫిర్యాదు చేసింది.

వెంటనే స్పందించిన మేనేజ్ మెంట్ అతన్ని స్కూల్ నుంచి పంపించేసింది. ఆ తర్వాత నుంచి కమిలిక దాస్‌కు స్కూల్‌లోని టీచర్లు, ప్రిన్సిపాల్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ విద్యార్ధి పైన నిరాధారమైన ఫిర్యాదు చేశావని, స్కూల్‌కి చెడ్డ పేరు తెస్తున్నావంటూ ఆమెపై స్కూల్ ప్రిన్సిపాల్ మండిపడ్డారు.

A Broken Father's Plea Reaches Education Minister Smriti Irani

ఇచ్చిన హిందీ హోంవర్క్ సరిగా చేయదని స్కూల్ నుంచి పంపిస్తామని ఇటీవల కమిలికకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో కమలిక చివరిసారిగా తన డైరీలో ప్రిన్సిపాల్ కి వీడ్కోలు సందేశం రాసి.... జనవరి 19న విద్యార్ధిని నివసిస్తున్న ఏడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ప్రిన్సిపాల్‌పై వస్తున్న ఆరోపణలపై స్పందించడానికి ఆతను నిరాకరించారు. దీంతో తన కూతురు మరణానికి కారకులైన ఆ ఇద్దరు టీచర్లుతో పాటు ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలని కోమలిక తండ్రి కిష్‌హోలే దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫాదర్స్ డే రోజున ''నన్ను నేను రక్షించుకోవడానికి మా నాన్న ఉండగా నాకెలాంటి అద్భుత శక్తి అవసరం లేదు'' అని నా కూతురు గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. కానీ తను ఆపదలో ఉన్నప్పుడు నేను రక్షించుకోలేక పోయానని కిష్‌హోలే దాస్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు. వచ్చే నెలల్లో కమిలక దాస్‌కు 18 ఏళ్లు రానున్నాయి.

English summary
Two weeks after a 17-year-old jumped off a Kolkata high-rise, Education Minister Smriti Irani will phone her family which alleges that she killed herself because she was harassed by her teachers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X