వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారం తిన్న ఎద్దు...! పేడలో వస్తుందని ఎదురుచూపులు...!!

|
Google Oneindia TeluguNews

నిత్యజీవితంలో ఆసక్తికర ఘటనలు జరుగుతుంటాయి. కొందరి వింత ప్రవర్తన అనర్థాలకు దారితీస్తుంది. తెలియకుండా జరుగుతున్న వాస్తవ ఘటనలు ఆసక్తికరంగా ఉండడంతో పాటు అందులో కొంత ఇబ్బందికర పరిణామాలు కూడా ఉంటాయి. అందులో ఇదో రకమైన సంఘటన. ఈ సంఘటనలో ఓ ఎద్దు చెత్తతోపాటు అందులో ఉన్న బంగారాన్ని తిన్నది.. దీంతో ఎద్దు తిన్న బంగారాన్ని బయటకు తీసుకొచ్చేందుకు సదరు కుటుంబసభ్యులు నానా తంటాలు పడుతున్నారు.

హర్యానాలో వింత సంఘటన

హర్యానాలో వింత సంఘటన

హర్యానా సిర్సా జిల్లా కలన్‌వాలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జనక్‌రాజ్ భార్య, కోడలు కలిసి రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చారు. అనంతరం వారిపై ఉన్న నాలుగు తులాల బంగారు అభరణాలను వంటగదిలోని ఓ గిన్నెలో పెట్టారు. ఆ విషయాన్ని మరిచిపోయిన కుటుంబసభ్యులు ఉదయం అందులోనే కూరగాయాల చెత్తను పడవేశారు. అనంతరం చెత్త ఉన్న గిన్నెను బయటపడేశారు. చెత్తతో పాటు బంగారం కూడ రోడ్డున పడింది.

చెత్తతో పాటు బంగారాన్ని తిన్న ఎద్దు

చెత్తతో పాటు బంగారాన్ని తిన్న ఎద్దు

చెత్తను బయటపడేసిన అనంతరం బంగారం వంటగదిలో పెట్టిన విషయాన్ని గుర్తుతెచ్చుకున్నారు. వెంటనే కూరగాయాలు పడవేసిన స్థాలానికి వెళ్లి వెతికి చూశారు. అయితే అప్పటికే బయటపడేసిన చెత్తను ఓ ఎద్దు తినడంతో బంగారం కనిపించలేదు. దీంతో తమ ఇంటి అవరణలో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో పరీశిలించారు. దీంతో చెత్తను ఓ ఎద్దు తిన్నట్టు గుర్తించారు. చెత్తతో పాటు బంగారాన్ని కూడ ఎద్దు తిన్నట్టు గుర్తించారు.

పేడలో బంగారం కోసం నిరీక్షణ

పేడలో బంగారం కోసం నిరీక్షణ

దీంతో వెంటనే ఆ ఎద్దును తీసుకువచ్చి ఇంట్లో ఉంచారు. అనంతరం వెటర్నిటీ వైద్యుని పిలిపించి పరిష్కారం కనుగొన్నారు. అయితే ఎద్దు పేడలో నుండి బంగారం వస్తుందని డాక్టర్ వివరించడంతో దానికి మేతపెడుతూ ఇంట్లోనే ఉంచారు. ఎద్దు పేడద్వార బంగారం బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జరిగి పదిరోజులు గడుస్తోంది. కానీ ఇంతవరకు బంగారం బయటకు రాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే పేడ ద్వారా బంగారం బయటకు రాకపోతే ఎద్దును గోశాలకు అప్పగిస్తామని కుటుంబ సభ్యులు తెలిపినట్టు తెలిసింది.

English summary
A bull ate about 40 grams of gold ornaments that belonged to a woman living in Kalanawali area in Haryana's Sirsa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X