వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎర చూపి గాలం వేశారని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ కర్ణాటక కార్యదర్శి శరణగౌడ కేసు నమోదు చేశారు. శరణగౌడ బీఎస్. యడియూరప్ప మీద నమోదు చేసిన కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది.

BJP'B'గ్రూప్ JJP:హరియాణాలో అసమ్మతి సెగ, సీఎం మీద పోటీ, దుశ్యంత్ ద్రోహం !BJP'B'గ్రూప్ JJP:హరియాణాలో అసమ్మతి సెగ, సీఎం మీద పోటీ, దుశ్యంత్ ద్రోహం !

జేడీఎస్ ఎమ్మెల్యేకు రూ. కోట్లు ఆఫర్

జేడీఎస్ ఎమ్మెల్యేకు రూ. కోట్లు ఆఫర్

బీఎస్. యడియూరప్ప బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపారు. ఆ సమయంలో గురుమిట్కల్ అసెంబ్లీ నియోజక వర్గం జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుందకూరుకు మాయమాటలు చెప్పి, కోట్ల రూపాయలు ఎర వేసి బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శరత్ గౌడ ఓ ఆడియో విడుదల చేశారు.

ఎమ్మెల్యే కొడుకుతో డీల్

ఎమ్మెల్యే కొడుకుతో డీల్

గురుమిట్కల్ జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరత్ గౌడ ఫిర్యాదు మేరకు బీఎస్. యడియూరప్ప మీద కేసు నమోదైయ్యింది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప ఆపరేషన్ కమల పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేశారని శరత్ గౌడ ఆరోపిస్తూ కేసు పెట్టారు.

స్టే ఇచ్చిన కోర్టు

స్టే ఇచ్చిన కోర్టు

బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకుండా కర్ణాటక కోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.
బీఎస్. యడియూరప్ప మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా మధ్యంతర స్టే రావడంతో శరత్ గౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేసు హైకోర్టు కులబర్గి పీఠం ముందు నవంబర్ 7వ తేదీ విచారణ జరగనుంది.

యడియూరప్ప అండ్ కో

యడియూరప్ప అండ్ కో

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూల్చడానికి ఆపరేషన్ కమల పేరుతో బీఎస్. యడియూరప్ప, హాసన్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ, ఎమ్మెల్యే శివనగౌడ నాయక్, యడియూరప్ప పీఏ ఎంబీ. మరమకల్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేశారని శరత్ గౌడ కేసు పెట్టారు. శరత్ గౌడను భేటీ అయ్యి ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడను బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారని కేసు నమోదైయ్యింది.

English summary
Bengaluru: A Case hearing against Karnataka CM Yediyurappa postponed to November 07. 'Operation Kamala' related case lodged against Yediyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X