వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం- మృతదేహాల రాక ముందే పది సమాధులు తవ్వేశారు- వేగంగా అంత్యక్రియల కోసం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి రాక తర్వాత ప్రపంచవ్యాప్తంగా మానవత్వం కరవవుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. వివిధ దేశాల్లో మానవత్వం లేకుండా జనం ప్రవర్తిస్తున్న తీరు వింటూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటు చేసుకున్న ఓ ఘటన కూడా ఇలాంటిదే. ఎవరి కారణాలు వారికి ఉన్నా... కరోనా మృతుల కోసం ముందుగా సమాధులు తవ్విపెట్టడం ఇక్కడ కలకలం రేపుతోంది.

 భోపాల్ లో ఓ స్మశానంలో ఏం చేశారంటే...

భోపాల్ లో ఓ స్మశానంలో ఏం చేశారంటే...

అది భోపాల్ లోని జహంగీరాబాద్ ప్రాంతం. అక్కడో స్మశానం పేరు జాఢా ఖబరిస్తాన్. ముస్లింల అంత్యక్రియలు నిర్వహించే స్మశానం ఇది. ఈ ఒక్క ప్రాంతంలోనే ప్రస్తుతం దాదాపు 220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భోపాల్ లో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న ప్రాంతం కూడా ఇదే. అసలే నగరంలో 900 కేసులు ఉన్నాయి. అందులో అత్యధిక కేసులు ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికే 35 మంది చనిపోయారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారో, వారిని ఏ అర్ధరాత్రి తీసుకొచ్చి పూడ్చమంటారో తెలియక స్మశాన నిర్వాహకులు కూడా అందోళనలో ఉంటున్నారు. చివరికి ఇలా కాదని వారు మృతదేహాలు రాగానే వెంటనే సమాధులు తవ్వుకుంటూ కూర్చుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఓ పది సమాధులు తవ్విపెట్టేశారు.

భోపాల్ మృతులంతా ఇక్కడికే...

భోపాల్ మృతులంతా ఇక్కడికే...

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భోపాల్ నగరం తీవ్రంగా సతమతం అవుతోంది. 900 పాజిటివ్ కేసుల్లో చాలా మంది పరిస్ధితి విషమంగా ఉంటోంది. వీరే కాకుండా ఇతరత్రా సమస్యలతో చనిపోయిన వారిని కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇక్కడికి తెచ్చే వారిలో ఎవరికి వైరస్ సోకిందో, ఎవరికి సోకలేదో కూడా తెలియదు. దీంతో స్మశాస నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పది సమాధులు తవ్విపెట్టినట్లు చెబుతున్నారు.

సమయాభావమే కారణం..

సమయాభావమే కారణం..


భోపాల్ లో కరోనాతో పాటు ఇతర సమస్యలతో చనిపోయిన వారిని కూడా ఇప్పుడు ఇళ్లకు కూడా తీసుకెళ్లకుండా ఆస్పత్రుల నుంచి నేరుగా ఇక్కడికే తీసుకొస్తున్నారు. వీరు వచ్చిన తర్వాత సమాధులు తవ్వడానికి కనీసం నాలుగైదు గంటలు సమయం పడుతుంది. అప్పట్లోగా మరో మృతదేహం తీసుకొస్తున్నారు. దీంతో కనీసం సమాధులు తవ్వేందుకు కూడా సమయం సరిపోవడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. నెల రోజుల్లో 38 మృతదేహాలను ఇక్కడ అంత్యక్రియల కోసం తీసుకొచ్చారని, ఇప్పుడు పరిస్ధితి మరింత తీవ్రంగా ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
సమాధి సిద్దంగా ఉంటే కేవలం అరగంటలోనే అంత్యక్రియలు పూర్తి చేసే పంపేందుకు వీలుంటుని చెప్తున్నారు.

English summary
A cemetery in bhopal made pre arrangements for covid 19 deaths draws new controversy as number of deaths increases in the city for last few days. cemetery staff keeps 10 graves ready for speedy burial of covid 19 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X