3rdక్లాస్ బాలికపై 6th క్లాస్ బాలుర ఆత్యాచారం...! అదికూడ అన్నదమ్ములే...!
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే రాజకీయ నాయకుల హత్యలు అత్యాచారాలతో అట్టుడుకుతున్న సంస్కృతి తాజాగా విద్యార్థుల వరకు చేరింది. ఈ నేపథ్యలంలో భాగపత్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూళ్లో మూడవ తరగతి చదువుతున్న బాలికపై అదే స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థితోపాటు అతని ఇద్దరు అన్నదమ్ములు స్కూల్ టాయిలెట్ లో అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచారానికి గురై అమ్మాయి ఆరోగ్యం క్షిణించడంతో 15 రోజుల తర్వత సంఘటన వెలుగులోకి వచ్చింది.

బాలికపై తోటి బాలురే అత్యాచారం...!
విద్యార్థులు అత్యాచారం చేశారంటేనే నమ్మలేని విధంగా ఉంది. కాని మూడో తరగతి చదివే బాలికపై అత్యాచారం జరిపారు. అది కూడ ఓకే కుటుంభానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాలికపై స్కూల్ టాయిలెట్లో అత్యాచారం చేశారు. అయితే బాలిక అత్యాచారానికి గురైన పదిహేను రోజుల తర్వాత విషయం బయటికి వచ్చింది. బాలిక ఆరోగ్యం క్షిణించడంతోపాటు మానసికంగా ఆవేదన చెందుతుండడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది.

గ్రామం పరువు పోతుందని వెనకుడు వేసిన గ్రామ పెద్దలు
అయితే బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత ముభావంగా ఉండడంతో ఆమే తీసుకుని తల్లిదండ్రులు స్కూల్ వెళ్లి విచారణ జరిపారు. అయిలే స్కూల్లో టీచర్ కూడ ఎలాంటీ సంఘటన జరగలేదని చెప్పింది.మరోవైపు ఈ ఘాయిత్యానికి పాల్పడిన వారు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కావడంతో గ్రామ పెద్దలు సైతం కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసులకు చెబితే గ్రామం పరువు పోతుందని కుటుంభసభ్యులతో చెప్పారు.

పట్టించుకోని పోలీసులు
అయితే బాలికపై ఆఘాయిత్యం జరిగిన తర్వత తల్లితండ్రులు పోలీసులకు పిర్యాధు చేశారు. కాని స్థానిక సీఐ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడ నమోదు చేయలేదు. బాలిక ఆరోగ్యం క్షిణించడంతో విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. విచారణ చేసిన పోలీసులు స్థానిక సీఐ నరేష్ కుమార్ను సస్పెండ్ చేశారు. అనంతరం విద్యార్ధులపై అత్యాచారంతో పాటు పోస్కో పలు సెక్షన్ల క్రింద కేసును నమోదు చేశారు. వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

కారణాలను వెతకాల్సిన అవసరం ఉంది.
మైనర్ విద్యార్థుల్లో విపరీత ధోరణులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఝానంతో విద్యార్థులు పెడధోరణులు పడుతున్నారు. ఆధునిక పోకడల మాయంలో పడి ఏం చేస్తున్నామో అనే విచక్షణ కొల్పోతున్న వైనం సమాజానికి ఇబ్బందికరంగా మారింది. దీనికి కారణం ఏమైన జరుగుతున్న పరిణామాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వాలు ప్రజలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!