• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తండ్రి పేటీఎం... డబ్బులు మాయం, ఆన్‌లైన్ గేమ్స్‌తో కొడుకు మజా...!

|

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు ఓ 4th క్లాస్ విద్యార్థి తన తండ్రి ఖాతా నుండి 35వేల రుపాయలు ఖర్చు పెట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా పేటీఎం అకౌంట్ క్రియోట్ చేసి తండ్రి అకౌంట్‌ను జోడించాడు. దీంతో ఆన్‌లైన్ గేమ్‌ కోసం తనకు అవసరమైనప్పుడల్లా బ్యాంకు నుండి పేటీఎంకు డబ్బులు జత చేశాడు. ఇలా సంవత్సరం నుండి ఆన్‌లైన్ గేమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తన ఖాతా నుండి డబ్బులు ఎలా మాయం అవుతున్నాయో తెలియని తండ్రి తలలు పట్టుకుని చివరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యూపీలో సంఘటన

యూపీలో సంఘటన

ఉత్తర ప్రదేశ్‌‌లోని లక్నోకు చెందిన ఓ నాలుగో తరగతి విద్యార్థి తన తండ్రినే చీట్ చేశాడు. ఆన్‌లైన్ గేమ్స్ కోసం ఫోన్‌లో పేటీఎం ఖాతా ఓపెన్ చేసి బ్యాంకు ఖాతను జోడించాడు. దీంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ పేటీఎం నుండి డబ్బులు చెల్లించాడు. ఇలా సంవత్సర కాలంగా ఆన్‌లైన్ గేమ్స్ కోసం తండ్రికి తెలియకుండానే డబ్బులు మాయం చేశాడు. దీంతో బ్యాంకు ఖాతాలో డబ్బుల మిస్టరీపై తండ్రి అయోమయానికి గురయ్యాడు. పలు సార్లు బ్యాంకు చుట్టు తిరగిన ఫలితం దక్కలేదు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనిగా అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డబ్బు మిస్ట్రీని చేధించిన పోలీసులు

డబ్బు మిస్ట్రీని చేధించిన పోలీసులు

రంగంలోకి దిగిన పోలీసులు డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయనే విషయాన్ని కనుగున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో స్వంత మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతాకు ఉండడం గమనించారు. పిర్యాధు దారు మొబైట్ నుండే డబ్బులు మాయం అవుతున్నట్టు పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని అతనికి తెలపడంతో ఒక్కసారిగా తండ్రి షాక్ తిన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పిల్లవాడితో కొద్దిసేపు మాట్లాడారు. ముందు భయంతో తాను చేసిన తప్పును ఒప్పుకోని బాలుడు...కొద్ది సేపటి తర్వాత విషయాన్ని బయటపెట్టాడు. తానే పేటీఎం ఖాతను ఓపేన్ చేశానని ఒప్పుకున్నాడు. అయితే తన తప్పును ఒప్పుకున్న విద్యార్థి తండ్రి కొడతాడానే భయంతో వణికి పోయాడు. పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

తల్లిదండ్రులు జాగ్రత్త

తల్లిదండ్రులు జాగ్రత్త

ప్రస్తుతం పిల్లలకు ఆన్‌లైన్ గేమ్స్‌పై ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. తల్లిదండ్రుల చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటికి వెళ్లిన వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని అందులో డౌన్‌లోడ్ చేయని గేమ్ ఉండదు. ఇలా టీవీల్లో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నా వాటిని కాదని స్మార్ట్ ఫోన్‌ గేమ్స్‌పైనే దృష్టంతా సారిస్తున్నారు. కొంతమంది అయితే వాటికి బానిసలా మారిపోతున్నారు. ఇలాంటీ పరిస్థితి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఇంటా కొనసాగుతుందనడంలో సంందేహం లేదు. పిల్లల సరదా కోసం చేతికి మొబైల్ ఫోన్ ఇస్తే..తెలియకండానే పలు దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంఘటనతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

English summary
A Class 4 student in UP capital Lucknow cheated his father and took out thousands of rupees from his bank account to play online games while the man went to the cyber crime cell over the unauthorised transactions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more