బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్ చెయ్యనని చెప్పిన కాలేజ్ అమ్మాయి: ఆమె ఇంటికెళ్లి రేప్ చేశాడు!

ప్రేమించడానికి నిరాకరించిన కాలేజ్ విద్యార్థిని మీద పగ పెంచుకున్న యువకుడు నేరుగా ఆమె ఇంటికెళ్లి అత్యాచారం చేసి నీకు ధిక్కున్న చోట చెప్పుకో అని సవాలు విసిరిన ఘటన బెంగళూరులో జరిగింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమించడానికి నిరాకరించిన కాలేజ్ విద్యార్థిని మీద ఓ యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. యువతి మీద పగతో రగిలిపోయిన ఆ యువకుడు నేరుగా ఆమె ఇంటికే వెళ్లి అత్యాచారం చేసి నీకు దిక్కున్న చోట చెప్పుకో అని సవాలు విసిరాడు.

బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లో ఓ విద్యార్థిని నివాసం ఉంటున్నది. యువతి కాలేజ్ కు వెళ్లే సమయంలో ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించాడు. మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయని సమాచారం.

A college girl has raped by a known person to her in bengaluru.

అయితే తాను ప్రేమించనని, మా కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అంగీకరించరని అతనికి చెప్పింది. ఈ విషయంపై కక్ష పెంచుకున్న యువకుడు నేరుగా ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతి మీద అత్యాచారం చేశాడు.

తరువాత నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని హెచ్చరించి అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో యువకుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.

English summary
A college girl has raped by a known person to her in bengaluru. He had continuously demanded her to marry him. The incident took place in Kumaraswamy Layout premise, and Kumaraswamy Layout Police arrested the man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X