బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి రమ్యపై బెంగళూరు సైబర్ క్రైంలో కేసు, నకిలీ అకౌంట్లు, రాహుల్ కోసం రీట్వీట్లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మండ్య మాజీ లోక్ సభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి రమ్య మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు నిర్వహించాలని, రాహుల్ గాంధీ ట్వీట్లకు రీట్వీట్లు చెయ్యాలని నటి రమ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని బీజేపీ నాయకులు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

Actress And Former MP Ramya Trolled Over Fake Accounts
బెంగళూరులో టీచింగ్

బెంగళూరులో టీచింగ్

కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యకర్తలతో బెంగళూరులో భేటీ అయిన నటి రమ్య సోషల్ మీడియాలో ఒక్కొక్కరు మూడు నకిలీ అకౌంట్లు ప్రారంభించాలని, మన పార్టీ ప్రయోజనాలకు అది చాల అవసరం అని నటి రమ్య పాఠాలు చెప్పారనే వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షాలకు పోటీ

ప్రతిపక్షాలకు పోటీ

నకిలీ ఫేస్ బుక్, ట్వీట్టర్ అకౌంట్లు ప్రారంభించి ప్రతిపక్షాలకు దీటుగా మనం సమాధానం ఇవ్వాలని, అందుకు మీరందరూ సిద్దంగా ఉండాలని నటి రమ్య కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యకర్తలకు సూచిస్తున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది.

తప్పుకాదు, రమ్య

తప్పుకాదు, రమ్య

నకిలీ ఫేస్ బుక్, ట్వీట్టర్ అకౌంట్లు ప్రారంభించడం తప్పు కదా అని ఓ కార్యకర్త నటి రమ్యను ప్రశ్నిస్తే అదేం లేదు, నాకు రెండు మూడు ఫేక్ అకౌంట్లు ఉన్నాయని, మీరు కూడా నన్ను ఫాలో కావాలని నటి రమ్య వారిని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ ఎంపీ ట్రైనింగ్

మాజీ ఎంపీ ట్రైనింగ్

భారతదేశంలో సోషల్ మీడియాలో ఉంటున్న నకిలీ అకౌంట్లు గుర్తించి వాటిని రూపుమాపడానికి ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుంటే, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మాజీ ఎంపీ, నటి రమ్య నకిలీ అకౌంట్లు ప్రారంభించండి అంటూ ట్రైనింగ్ ఇవ్వడం ఎంత వరకూ న్యాయం అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

 రాహుల్ గాంధీ కోసం?

రాహుల్ గాంధీ కోసం?

ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్లను క్షుణ్ణంగా పరిశీలించిన సమయంలో ఆయన ట్వీట్ లకు రీట్వీట్లు రష్యా, కజకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, ఇండోనేషియా జాతీయులు చేసే ట్వీట్ ల లక్షణాలు ఉన్న రీట్వీట్లు వచ్చాయని బీజేపీ నాయకులు అంటున్నారు.

ట్వీట్టర్ కంపెనీతో!

ట్వీట్టర్ కంపెనీతో!

నకిలీ ట్వీట్టర్ అకౌంట్లతో రమ్య తన ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానాలు ఉన్నాయని, ట్వీట్టర్ కంపెనీతో సంప్రధించి నకిలీ అకౌంట్ల విషయంలో ఆడిటింగ్ చేయించాలని బీజేపీ నాయకులు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు మనవి చేశారు.

రమ్యకు 50 నకిలీ అకౌంట్లు

రమ్యకు 50 నకిలీ అకౌంట్లు

నటి రమ్య పేరుతో, ఆమె ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలతో పాటు నకిలీ కంపెనీల పేరుతో దాదాపు 50 నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయని, వాటి మీద విచారణ కొనసాగించాలని బీజేపీ నాయకులు బెంగళూరు సైంబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆధార్ లింక్ చెయ్యండి

ఆధార్ లింక్ చెయ్యండి

సోషల్ మీడియాలోని ఫేస్ బుక్, ట్వీట్టర్, ఇన్ స్టాగ్రామ్, గూగుల్ ఫ్లస్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేసిన సమయంలోనే నకిలీ అకౌంట్లకు కళ్లెం వేసే అవకాశం ఉంటుందని, రమ్య విషయంలో విచారణ జరిపి చట్టపరంగా ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బెంగళూరు సైంబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Mandya BJP leader filed complaint against former MP and actress Ramya with cyber crime police, Bengaluru, alleging fake face book account creation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X