బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గొంతులు కోసుకున్న నవదంపతులు, మూడు నెలల కిత్రం పెళ్లి, అసలు ఏం జరిగిందో ?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జీవితంపై విరక్తిచెందిన నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. గొంతులు కోసుకున్న నవదంపతులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. దంపతుల ఆత్మహత్యాయత్నంకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.

ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!

బెంగళూరు నగరంలోని గిరినగరలో బాలాజీ, సౌమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితమే బాలాజీ, సౌమ్య వివాహం జరిగింది. బెంగళూరు నగరంలోని ప్రైవేట్ కంపెనీలో బాలాజీ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత బాలాజీ, సౌమ్య దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారని తెలిసింది.

A couple who attempted suicide have escaped the jaws of death in Bengaluru.

మంగళవారం సాయంత్రి బాలాజీ ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లాడు. తరువాత ఏం జరిగిందో ఏమో నివాసం ఉంటున్న ఇంటిలోనే బాలాజీ, సౌమ్య దంపతులు గొంతులు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. సౌమ్య బంధువులు ఆమెకు ఫోన్ చెయ్యగా ఎలాంటి స్పందన లేదు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు, అంతే!డిగ్రీ కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు, అంతే!

తరువాత బాలాజీ మొబైల్ కు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. వెంటనే బాలాజీ, సౌమ్య దంపతులను ఆసుపత్రికి తరలించారు. బాలాజీ, సౌమ్య దంపతులకు శాస్త్ర చికిత్స చెయ్యడంతో ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు అంటున్నారు.

కుటుంబ సమస్యలతో బాలాజీ, సౌమ్య దంపతులు ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని, ఐసీయులో చికిత్స పొందుతున్న నవదంపతులు కోలుకున్న తరువాత అసలు విషయం తెలుస్తోందని, వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని గిరినగర పోలీసులు తెలిపారు.

English summary
A couple who attempted suicide have escaped the jaws of death in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X