వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక గాంధిపై క్రిమినల్ కేసు.. పెహ్లు ఖాన్ కేసులో కోర్టు దిక్కారణ...

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లోని పెహ్లు ఖాన్ మృతి కేసులో కోర్టు తీర్పుపై కామెంట్ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమే దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని ట్విట్టర్‌లో పేర్కోన్నారు. దీంతో ఆమే చేసిన వ్యాఖ్యలు కోర్టు దిక్కారంతో పాటు పాటు మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని, సుధీర్ ఓజా అనే వ్యక్తి పిర్యాధు చేశారు. కాగా పిటిషన్ పై ఆగస్టు 26న కోర్టు విచారణ జరపనుంది.

A criminal case was filed against Congress leader Priyanka Gandhi Vadra

రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. విచారణ ఎదుర్కోన్న ఆరుగురు నిందితులు నిర్దోషులని తీర్పులో పేర్కొన్నది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 14న తుది తీర్పును వెల్లడించారు. జిల్లా అడిషనల్ జడ్జ్ జస్టిస్ సరితా స్వామి పెహ్లూ ఖాని దాడి కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు.

2017 ఏప్రిల్ 1న పెహ్లు ఖాన్ .. తన ఇద్దరు కుమారులు, మరో నలుగురితో కలిసి జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సంధర్భంలోనే. ఆయన గోవులను అక్రమంగా సరఫరా చేస్తున్నారని కొందరు అడ్డగించారు. వారి వాహనాన్ని ఆపి విచక్షణరహితంగా కొట్టారు. దీంతో పెహ్లూ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని అల్వార్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పెహ్లుఖాన్ మృతి చెందాడు. కాగా మూడురోజుల తర్వాత దాడికి సంబంధించిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులకు పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడం కలకలం రేపింది. కానీ వీడియో వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. కాగ అంతకుముందు అనేక నాటకీయ పరిణామ మధ్య రాజస్థాన్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కేసుల్లో పెహ్లుఖాన్ పేరు పేర్కోంది.

English summary
A criminal case was filed against Congress leader Priyanka Gandhi Vadra in connection with her tweet on a trial court verdict in Rajasthan in which six accused in the Pehlu Khan lynching case were acquitted. The criminal case against Priyanka Gandhi was filed by petitioner Sudhir Ojha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X