వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు ‘ఒసామా బిన్ లాడెన్’: ఐదుగురుని చంపింది.. ఎట్టకేలకు చిక్కింది, డ్రోన్లతో వేటాడారు

|
Google Oneindia TeluguNews

గౌహతి: వేలాది మంది ప్రాణాలు తీసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు. ఇక్కడి ప్రజల ప్రాణాలు తీస్తూ భయాందోళనలకు గురిచేసిన ఓ క్రూరమైన ఏనుగుకే ఇక్కడివారు ఆ పేరు పెట్టడం గమనార్హం.

అందుకే ఒసామా బిన్ లాడెన్

అందుకే ఒసామా బిన్ లాడెన్

అసోంలోని గోల్పారా జిల్లాలోని అడవుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఓ ఏనుగుకు ఇక్కడి ప్రజలు ‘ఒసామా బిన్ లాడెన్' అనే పేరు పెట్టారు. ఆ పేరు వింటేనే ఇక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు, ప్రజలు తీవ్రంగా ప్రయత్నించారు.

ఒక్కరోజే ఐదుగురి ప్రాణాలు తీసి..

ఒక్కరోజే ఐదుగురి ప్రాణాలు తీసి..

ఓ రోజు రాత్రి ఆ ‘ఒసామా బిన్ లాడెన్' ఏనుగు ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీయడంతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేగాక, ఆ అటవీ ప్రాంతం గుండా రహదారిపై వెళ్లాలన్నా ప్రజలు, వాహనదారులు జంకుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆ ఏనుగును ఎలాగైనా పట్టుకోవాలని.

డ్రోన్లతో వేట.. ఎట్టకేలకు

డ్రోన్లతో వేట.. ఎట్టకేలకు

ఈ క్రమంలో ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగును పట్టుకునేందుకు ఎనిమిదిమంది అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు డ్రోన్లను కూడా ఉపయోగించారు. ఎట్టకేలకు సోమవారం ఆ ఏనుగు జాడ కనుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరు నిపుణులు ఆ ఏనుగును శాంతపర్చి.. రెండు బాణాలతో మత్తుమందిచ్చి పట్టుకున్నారు.

జనావాసాలకు దూరంగా..

జనావాసాలకు దూరంగా..

ఇప్పుడు ఆ ఏనుగును జనావాసాలకు దూరంగా.. పెద్ద అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ నెలలో కేవలం 24 గంటల్లోనే ఆ ఒసామా బిన్ లాడెన్ ఏనుగు గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తుల ప్రాణాలు తీసింది. ఈ ఏనుగు దాడిలో మరణించినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాగా, గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో మనదేశంలో సుమారు 2300 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అదే సమయంలో 2011 నుంచి 700 ఏనుగులు కూడా చంపివేయబడ్డాయి.

English summary
An elephant named after the late Al-Qaeda leader Osama bin Laden that killed five Indian villagers has been caught after a massive operation to hunt down the creature, officials said on Monday (Nov 11).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X