వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో ఫోటోలను మార్ఫ్ చేసి , 100 మంది మహిళలకు షాక్ .. ఓ సైబర్ క్రిమినల్ కథ

|
Google Oneindia TeluguNews

ఓ బ్యాంకు మేనేజర్ ను ఆమె నకిలీ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని బెదిరించి, ఆమె వద్ద నుండి డబ్బులు వసూలు చేసిన ఓ సైబర్ క్రిమినల్ ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఇండస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న బాధితురాలు ఢిల్లీ లోని మాల్వియా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాడి పట్టుకున్న పోలీసులు అతగాడు చేసిన నేరాల చిట్టా ని చూసి షాక్ తిన్నారు.

 కపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరిక కపుల్ ఛాలెంజ్,బ్యూటీఫుల్ డాటర్ ఛాలెంజ్..ఆ ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీల సైట్లలో..సైబర్ క్రైం హెచ్చరిక

మహిళల ఫోటోలను అసభ్య రీతిలో మార్ఫ్ చేసి .. 100 మంది మహిళల బ్లాక్ మెయిల్

మహిళల ఫోటోలను అసభ్య రీతిలో మార్ఫ్ చేసి .. 100 మంది మహిళల బ్లాక్ మెయిల్

ఇది ఒక క్రిమినల్ కథ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ మోసకారి కథ. సోషల్ మీడియాలో మహిళలు పెట్టిన ఫోటోలను తీసి, ఆ ఫోటోలను మార్ఫ్ చేసి ,అశ్లీల చిత్రాలుగా తయారుచేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నోయిడాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ ఝా అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను దాదాపు వందమంది మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు వెల్లడించారు.

 సోషల్ మీడియా అకౌంట్ల నుండి ఫోటోలు డౌన్ లోడ్ .. ఆపై మార్ఫ్ చేసి డబ్బుల కోసం వేధింపులు

సోషల్ మీడియా అకౌంట్ల నుండి ఫోటోలు డౌన్ లోడ్ .. ఆపై మార్ఫ్ చేసి డబ్బుల కోసం వేధింపులు

సోషల్ మీడియాలో మహిళలు అకౌంట్ల నుండి ఫోటోలు డౌన్లోడ్ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటిల్లో సదరు మహిళలకు సంబంధించిన అశ్లీల మార్ఫ్ చేసిన ఫోటోలు పెడతానని సదరు కేటుగాడు బెదిరింపులకు పాల్పడేవాడిని పోలీసులు వెల్లడించారు. మార్ఫ్ చేసిన ఫోటోలను మహిళలకు పంపి , అడిగినంత డబ్బు ఇవ్వాలని వేధించేవాడని పేర్కొన్నారు.
ఇండస్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మాల్వియా నగర్ నివాసి అయిన మహిళ, తన చిత్రాన్ని హ్యాక్ చేసిన తర్వాత దానిని మార్ఫ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి నిందితుడు తనను వేధించి, దోపిడీ చేశాడని ఆరోపించారు.

ఇండస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడిన కేతుగాడి కథ

ఇండస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడిన కేతుగాడి కథ

ఇండస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు . నిందితుడు పోలీసులకు దొరక్కుండా ఉండడం కోసం వాట్సప్ ద్వారా వివోఐపీ కాల్స్, వేరే యాప్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడేవాడిని పోలీసులు వెల్లడించారు. నిందితుడు గతంలో కూడా ఇదే నేరం కింద ఛత్తీస్ గడ్ , నోయిడాలో రెండుసార్లు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఏ మాత్రం మార్పు లేకుండా మళ్ళీ ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడని వారు వెల్లడించారు .

బాధితుల జాబితా చూసి షాక్ అయిన పోలీసులు

బాధితుల జాబితా చూసి షాక్ అయిన పోలీసులు


సైబర్ నేరగాడు మోడస్ ఒపెరాండిలో మహిళల సోషల్ మీడియా ఖాతాల నుండి ప్రొఫైల్ చిత్రాలను సేవ్ చేసి, ఆపై వాటిని మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించి మహిళలకు బెదిరింపు సందేశాలను పంపాడని, మహిళలు రుజువు అడిగినప్పుడు, నిందితుడు వారి మార్ఫింగ్ చిత్రాన్ని పంపారని పేర్కొన్నారు. చిత్రాలను తొలగించకుండా మహిళల నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడని వెల్లడించారు.

ఇతని బాధితుల జాబితా చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అందుకే మహిళలు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు .

English summary
Delhi police have nabbed a cyber criminal who allegedly extorted money from a bank manager after threatening to make her fake pornographic images go viral on social media. The victim, who was working as a manager at Indus Bank, had lodged a complaint with the Malviya Nagar police in Delhi. Police arrested the accused and they said he blackmailed nearly a hundred women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X