వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లూడో గేమ్ లో మోసం చేశాడని .. తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసిన కూతురు

|
Google Oneindia TeluguNews

తండ్రిపై ఒక కూతురు మోసం చేశారంటూ కేసు పెట్టడం చూశారా? అది కూడా ఏ ఆస్తుల పంచాయతీలతోనో , ఏ భూముల గురించో కాదు. లూడో గేమ్ లో తనను మోసం చేశాడని తండ్రి పైన ఒక కూతురు ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో ఆసక్తికరంగా అనిపించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే

తన మైనపు విగ్రహాన్ని చేయించుకున్న ఎస్పీ బాలు .... విగ్రహం చూడకుండానే అస్తమయంతన మైనపు విగ్రహాన్ని చేయించుకున్న ఎస్పీ బాలు .... విగ్రహం చూడకుండానే అస్తమయం

లూడో ఆటలో తండ్రి తనను ఓడించటాన్ని భరించలేక ఫ్యామిలీ కోర్టులో కంప్లైంట్

లూడో ఆటలో తండ్రి తనను ఓడించటాన్ని భరించలేక ఫ్యామిలీ కోర్టులో కంప్లైంట్

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల ఒక యువతి తన తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో కంప్లైంట్ చేసింది. ఖాళీ సమయాల్లో సదరు యువతి తన తండ్రితో కలిసి లూడో గేమ్ ఆడుతూ ఉండేది. ఆమెకు తండ్రి అంటే ఎంతో నమ్మకం. అయితే తండ్రి లూడో గేమ్ లో పదే పదే ఆమె కాయిన్లను చంపుతూ ఆటలో గెలిచేవాడు. తనను తన తండ్రి ఓడించడాన్ని సహించ లేకపోయిన ఆ కుమార్తె ఆయనపై ద్వేషాన్ని పెంచుకుని, తండ్రి పట్ల గౌరవాన్ని కోల్పోయింది. ఆయనను నాన్న అని పిలవడానికి కూడా తను ఇష్టపడలేదు.

 మోసం చేసి గెలుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న యువతి

మోసం చేసి గెలుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న యువతి

మోసం చేసి గెలుస్తాడనిస్తున్నారని భావించిన కుమార్తె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.ప్రపంచంలోని అన్ని ఆనందాలను తనకు ఇవ్వాల్సిన తండ్రి, అది మర్చి పోయి తనను ఓడించి బాధ పెట్టాడని, మోసం చేసి గెలిచాడని ఆమె తండ్రి పై ఫిర్యాదు చేసింది. తన ఆనందం కోసం తన తండ్రి ఓడిపోయి ఉండాల్సిందని ఆమె పేర్కొంది. ఈ సంఘటన తర్వాత తనకూ తన తండ్రికి మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా నమ్మటం ప్రారంభించిన సదరు యువతికి ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ఇప్పించింది.

Recommended Video

Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
తండ్రిపై కుమార్తెకు ద్వేషం ... నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన ఫ్యామిలీ కోర్టు

తండ్రిపై కుమార్తెకు ద్వేషం ... నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన ఫ్యామిలీ కోర్టు

ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ సరిత ఈ కేసు విషయంలో సదరు యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నాలుగు సెషన్ల కౌన్సిలింగ్ తర్వాత ఆమె ఇప్పుడు తండ్రిపై సానుకూల ఆలోచనతో ఉందని కౌన్సిలర్ తెలిపారు. ఏది ఏమైనా సాధారణమైన ఒక చిన్న ఆట విషయంలో ఓటమి భరించలేని ఒక కుమార్తె ఏకంగా తన తండ్రి మోసం చేశాడని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఆటలను సరదాగా తీసుకోకుండా సీరియస్ గా తీసుకుంటే ఇలాగే ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. మానవీయ విలువలను చిన్ననాటి నుండే నేర్పాలంటున్న నిపుణులు గెలుపు , ఓటములను సమానంగా తీసుకునేలా, సరదాగా తీసుకునేలా పిల్లలను తయారు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక నిపుణులు. మానవసంబంధాలను , అనుబంధాలను , వాటి ప్రాధాన్యతను పిల్లలకు చిన్న వయసు నుండే చెప్పాలని లేదంటే ఇలానే తండ్రి, తల్లి, సోదరులు అని కూడా చూడకుండా చిన్న చిన్న విషయాల్లో ఈ విధంగా ప్రవర్తిస్తారని అంటున్నారు . స్కూల్స్ స్థాయి నుండే పాఠ్యాంశాలతో పాటు మానవీయ విలువలను నేర్పించాలని , పోటీ తత్వం ఉన్నా , సర్దుకునే స్వభావం కూడా అలవాటు చెయ్యాలని మానసిక నిపుణులు చెప్తున్నారు.

English summary
A 24-year-old woman approached a family court in Bhopal to file a complaint about his father cheating a game of Ludo.The woman lost respect for her father, she didn't even want to call him a "father". family court couselled the daughter .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X