వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిరాకిల్: చనిపోయిన 50 ఏళ్లకు ప్రత్యక్షమైన ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు, ఆంధ్రా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి తిరిగి ప్రత్యక్షం కావడంతో ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు షాక్ కు గురైన సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చనిపోయిన 50 ఏళ్ల తరువాత అతను ఎలా బతికి వచ్చాడు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన 50 ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన వ్యక్తిని చూడటానికి పరిసర ప్రాంతాల గ్రామస్తులు క్యూ కట్టారు.

చిత్రదుర్గ జిల్లాలోని చిత్రనాయకనహళ్ళిలో నివాసం ఉంటున్న సన్న ఈరన్న అనే వ్యక్తి 50 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ సభ్యులు సన్న ఈరన్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మరుసటి రోజు సమాధిలో సన్న ఈరన్న మృతదేహం మాయం అయ్యింది.

A dead man who arrived 50 years later in Karnataka, his wifes children are in shock

ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!

జోగి కులానికి చెందిన సన్న ఈరన్న మృతదేహాన్ని ఎవరైనా మంత్రగాళ్లు ఎత్తుకెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు బావించారు. రెండు రోజుల క్రితం సన్న ఈరన్న బంధువులు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని గుమ్మగుట్ట ప్రాంతంలో గొర్రెలు పెంచడానికి మందులు తీసుకురావడానికి వెళ్లారు.

ఆ సమయంలో గుమ్మగుట్టలో జోగి కులస్తులు నివాసం ఉండే చోట కూలి పనిచేస్తున్న సన్న ఈరన్న గొర్రెల పెంచడానికి మందులు తీసుకురావడానికి వచ్చిన బంధువులను గుర్తించాడు. వెంటనే బంధువుల సహాయంతో సన్న ఈరన్న చిత్రదుర్గ జిల్లాలోని చిత్రనాయకనహళ్ళికి చేరుకున్నాడు.

ఉప ముఖ్యమంత్రి పని ఫినిష్ ? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ చాన్స్ లేదు, రాజీనామా ఒక్కటే !ఉప ముఖ్యమంత్రి పని ఫినిష్ ? ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ చాన్స్ లేదు, రాజీనామా ఒక్కటే !

సన్న ఈరన్నను చూసిన కుటుంబ సభ్యులు షాక్ కు గురైనాడు. 50 ఏళ్ల కిత్రం తన భార్య ఈరమ్మకు గాయాలు కావడంతో తాను చికిత్స చేయించానని, శరీరం మీద ఏఏ చోట్ల గాయాలు ఉన్న విషయం తాను చెబుతానని సన్న ఈరన్న అన్నాడు.

సన్న ఈరన్న చెప్పిన ఆనవాళ్లు తెలుసుకున్న భార్య ఈరమ్మ, సోదరులు బేవన్న, అజ్జప్ప, కుమారులు ఈరన్న, మరియప్ప షాక్ కు గురైనారు. వెంటనే హారతులు ఇచ్చి సన్న ఈరన్నను ఇంటిలోకి ఆహ్వానించారు. చనిపోయిన ఈరన్నను మంత్రగాళ్లు తీసుకెళ్లి మరుజన్మ ఇచ్చి ఉంటారని చిత్రనాయకనహళ్ళి గ్రామస్తులు అంటున్నారు. జోగి కులానికి చెందిన సన్న ఈరన్న అదే కులానికి చెందిన ముగ్గురు అక్కచెళ్లలను వివాహం చేసుకున్నాడు. చనిపోయిన 50 ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిని చూడానికి జనాలు పోటెత్తారు.

English summary
Karntaka: A man has died 50 years ago and now suddenly He came to Home, his wife's children are in shock, This incident happened in Chitradurga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X