వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.100000 కు యుక్తవయస్సులో ఉన్న కూతురిని అమ్మిన తల్లీ...!

|
Google Oneindia TeluguNews

ఓ తల్లీ తన తన సంతానంపై కర్కశాన్ని ప్రదర్శించింది. లక్ష రుపాయల కోసం కకుర్తి పడ్డ తల్లి యుక్తవయస్సులో ఉన్న కూతురిని బ్రోతల్ హౌజ్‌ కోసం అమ్మివేసింది. అయితే విషయం తెలియని యువతి అక్రమార్కుల చేతిలో పడిపోయింది. అక్కడి వారి సహయంతో చేతిలో పదిరూపాయలు పెట్టుకుని స్వంత ఇంటికి చేరింది. మహిళ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఇదంత కామన్‌గానే చూస్తున్న పోలీసులు మాత్రం ఇంకా ఎవ్వరిపై చర్యలు చేపట్టలేదు.

డబ్బుల కోసం కూతురు,కొడుకును అమ్మిన తల్లీ

డబ్బుల కోసం కూతురు,కొడుకును అమ్మిన తల్లీ

మహిళలను అమ్మడం, కొనడం ఇదంతా దేశ రాజధానిలో రొటిన్ మారిపోయిందా అనే పరిస్తితి నెలకోంది. ఢిల్లీకి చెంది ఓ తల్లి తన 15ఏళ్ల మైనారీటి తీరని స్వంత కూతురిని ఓ అరవై ఏళ్ల ముసలాడికి అట్టగట్టి వదిలించుకుందామని భావించింది. కూతురు వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నాన్ని విమరమించుకుంది. దీంతో మరో కుట్రకు తెరలేపిన తల్లీ కూతురునే అమ్మేందుకు సిద్దమైంది.

లక్ష రుపాయలకు యువతి అమ్మకం

లక్ష రుపాయలకు యువతి అమ్మకం

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అబ్దుల్ అనే బ్రోకర్‌తో లక్ష రుపాయకు కూతురును అమ్మేందుకు సిద్దమైంది. దీంతో తన సోదరీ ఇంటికి వెళదామని చెప్పిన తల్లీ నిజాముద్దిన్‌లో ఓ హొటల్‌కు తీసుకెళ్లింది. హోటల్‌లో అమ్మకానికి ఒప్పందం కుదిరిన అనంతరం తనకు వేరే ఇతర పని ఉందని అక్కడే ఉన్న షాహిద్ అనే వ్యక్తి యువతిని ఇంటికి తీసుకెళతాడని చెప్పి నమ్మించి వెళ్లిపోయింది. ఆమే వెళ్లిన అనంతరం షాహిద్ అనే వ్యక్తి ఢిల్లీలోని భావన్ నగర్‌ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు.

బ్రోతల్ హౌజ్ నుండి తప్పించుకున్న యువతి

బ్రోతల్ హౌజ్ నుండి తప్పించుకున్న యువతి

యువతి అక్కడి వెళ్లేసరికి మరికొంతమంది యువతులు కూడ అక్కడ ఉండడం ఆమే గమనించింది. ఇక ఇంటికి వెళ్లిన యువతికి పెళ్లి బట్టలు వేసుకోమని ఇతర అమ్మాయిలు చెప్పడంతో ఎందుకు వేసుకోమ్మని చెబుతున్నారని అడిగినప్పుడు తన అమ్మ లక్ష రుపాయల కోసం నిన్ను అమ్మి వేసిందని చెప్పారు. ఇప్పుడు అవి రాబట్టుకోవడం కోసం నిన్ను కస్టమర్స్‌ దగ్గరకు పంపుతున్నాడని ఆమేతో చేప్పారు. దీంతో విషయాన్ని గమనించిన యువతి ఒక రోజు బ్రోతల్ హౌజ్‌లో మెయింటెన్ చేసింది.తెల్లవారు జామున చేతిలో పది రుపాయలను పట్టుకుని షేర్ ఆటోలో తన ఇంటికి వెళ్లి పొరుగు వారి సహయంతో ఢిల్లీ మహిళా కమీషన్‌కు పిర్యాధు చేసింది.

అప్పుకోసం కొడుకును కూడ అమ్మిన తల్లీ

అప్పుకోసం కొడుకును కూడ అమ్మిన తల్లీ

దీంతో హుటాహుటిని చేరుకున్న మహిళ కమీషన్‌ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.యవతిని మహిళా ఆశ్రమానికి పంపించారు. కాగా గత కొద్ది రోజుల క్రితమే ఓ ముసలాడికి పెళ్లి చేస్తానని చెప్పిన తల్లిపై కేసులు పెడతానని బెదించింది. అయితే నెలరోజుల క్రితమే అప్పు తీర్చడం కోసం తన తమ్ముడిని కూడ అమ్మివేసిందని మహిళ కమీషన్‌కు యువతి తెలిపింది.దీంతో ఢిల్లీ పోలీసుల తీరుపై మహిళ కమీషన్ చైర్మణ్ స్వాతీ మాలివాల్ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిపై చర్యలు తీసుకోవడంతో పాటు అమ్మిన బాలుడి ఆచూకి కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు.

English summary
Delhi Commission for Women (DCW) on Saturday rescued a 15-year-old girl who was sold-off by her mother to a trafficker for Rs one lakh. While an FIR has been registered under section 370A of the IPC, no arrests have been made so far. The victim has been shifted to a shelter home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X