వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృపాణాలతో రైతుల దాడి: సొమ్మసిల్లిన పోలీసులు: భగ్గుమంటోన్న బీజేపీ: అసాంఘిక శక్తులుగా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధానిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ రక్తసిక్తమైంది. లక్షలాదిగా తరలివచ్చిన రైతులను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వారిపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించడంతో రైతులు భగ్గుమన్నారు. లాఠీ చార్జీ చేయడాన్ని ప్రతిఘటిస్తూ ఎదరుదాడులకు దిగుతున్నారు. తమ సంప్రదాయబద్ధమైన కృపాణాలతో సిక్కు సామాజిక వర్గానికి చెందిన రైతులు పోలీసులపై దాడులు చేయడం కనిపించింది.

దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను భారతీయ జనతా పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసాంఘిక శక్తులు రైతుల్లో కలిసిపోయారంటూ మండిపడుతున్నారు. నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీని కొనసాగించాల్సి ఉంటుందంటూ ఇదివరకు ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ మార్గాల్లో వెళ్లడానికి రైతులు ససేమిరా అన్నారు. ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. ఆ మార్గంలో ప్రయాణించడానికి వారికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.

ట్రాక్టర్లు ముందుకు సాగకుండా పోలీసులు ఏకంగా మానవహారంగా ఏర్పాడ్డారు. రోడ్డుపై బైఠాయించారు. అయినప్పటికీ.. రైతులు పట్టించుకోలేదు. ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీనితో పోలీసులు-రైతుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు తోసుకున్నారు. గొడవలకు దిగారు. ఆ ఘటనల్లో అటు పోలీసులు, ఇటు రైతులు గాయపడ్డారు. కొందరు పోలీసులు సొమ్మసిల్లి పోయి కనపించారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

A Delhi Police personnel fell unconscious while on duty at Dilshad Garden, during the farmers protest

చాలా చోట్ల రైతులు విధ్వంసానికి దిగారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. ప్రత్యేకించి ఐటీఓ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీఓ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు దాటుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రక్తసిక్తమైంది. పరిస్థితులు చేయి దాటుతుండటంతో అదనపు బలగాలను ఆయా ప్రాంతాలకు తరలించారు.

English summary
A Delhi Police personnel was looked after by other Police personnel as he fell unconscious while on duty at Dilshad Garden, during the farmers' protest. He is now being taken to a hospital after regaining consciousness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X