వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార్తె పెళ్లి కోసం రూ. 50 లక్షలు, వరద భాదితులకు ఇచ్చిన లేడీ డాక్టర్ ? ఫేస్ బుక్ లో !

|
Google Oneindia TeluguNews

ముంబై/బెంగళూరు: కుమార్తె పెళ్లి కోసం దాచి పెట్టుకున్న రూ. 50 లక్షలు వరద భాదితుల కోసం సీఎం సహాయ నిధికి ఇచ్చామని కర్ణాటకకు చెందిన డాక్టర్ ఫేస్ బుక్ లో వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తాము రూ. 50 లక్షలు ఇచ్చామని డాక్టర్ సుమనా రావ్ ఫేస్ బుక్ రాసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కుమార్తె పెళ్లి కోసం దాచి పెట్టుకున్న రూ. 50 లక్ష్లలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చామని, వరద భాదితుల కోసం సహాయం చేశామని డాక్టర్ సుమనా రావ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అయితే డాక్టర్ సుమనా రావ్ ఫేస్ బుక్ లో చేసిన పోస్టు ఇప్పుడు డిలీట్ చేశారు.

A doctor posted in facebook that she gave Rs 50 lakh to CM relief fund in Karnataka

కర్ణాటకకు చెందిన డాక్టర్ సుమనా రావ్ ముంబైలో నివాసం ఉంటున్నారు. సుమనా రావ్ ముంబైలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, వారిని ఆదుకోవడానికి కుమార్తె పెళ్లి కోసం దాచి పెట్టుకున్న రూ. 50 లక్షలు సీఎం సహాయ నిధికి డాక్టర్ సుమనా రావ్ ఇచ్చారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.

ఈ విషయంపై డాక్టర్ సుమనా రావ్ ను సంప్రధించి వివరాలు తెలుసుకోవాలని ఒన్ ఇండియా కన్నడ ప్రయత్నించింది. అయితే డాక్టర్ సుమనా రావ్ అందుబాటులోకి రాలేదు. సుమనా రావ్ ఫేస్ బుక్ పోస్టు స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డాక్టర్ సుమనా రావ్ ఔధార్యం గురించి సోషల్ మీడియాలో చాల మంది మెచ్చుకుంటున్నారు. అయితే డాక్టర్ సుమనా రావ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇచ్చామని పోస్టు చెయ్యడం, తరువాత ఆ పోస్టు డిలీట్ చెయ్యడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ సుమనా రావ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇచ్చారు అనే విషయం సంబంధిత అధికారులు ఇంత వరకు దృవీకరించలేదు.

English summary
Karnataka Floods: Dr. Sumana Rao (Mumbai) posted on Facebook that she gave 50 lakh rupees to CM relief fund to help flood victims. She deleted the post later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X