వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరికి తెలియకుండా..మరొకరితో ఏకంగా: భర్త మృతదేహం కోసం ఏడుగురు భార్యలు..ఇలా.. .!

|
Google Oneindia TeluguNews

ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకుంటేనా..వీరి చేతిలో ఏమయ్యేవాడో. ఇదీ మరణించిన ఒక డ్రైవర్ గురించి స్థానికులు అంటున్న మాటలు. ఒకరికి తెలియకుండా మరొకరు. ఒకరు కాదు..ఇద్దరు కాదు. ఏకంగా ఏడుగురు. అందరూ భార్యలే. తమ భర్త పోయాడని ఏడుగురూ ఒకే చోట చేరారు. మృతదేహాన్ని తనకు ఇవ్వాలంటే తనకు ఇవ్వాలని కొట్టుకున్నారు. బతికి ఉండగా అంత జాగ్రత్తగా ఏడుగురి భార్యలను కనీసం అనుమానం కూడా రాకుండా జీవితం నడిపిన ఆ డ్రైవర్..ఆర్దిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో ఆయన మృతదేహాన్ని అందరికీ తెలిసిన ఆయన భార్యతో పాటు ఉండే ఇంటికి తీసుకెళ్లారు. అసలు కధ అక్కడే మొదలైంది. ఒకరి తరువాత మరొకరు..ఏకంగా ఏడుగురు తామే ఆ వ్యక్తి భార్యలమంటూ ముందుకొచ్చారు. ఆ మృతదేహాన్ని తమకు అప్పగించాలంటే కాదు తమకే అప్పగించాలని గొడవకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు.

బస్తీకి చెందిన పవన్ కుమార్

బస్తీకి చెందిన పవన్ కుమార్

హరిద్వార్ లో జరిగిన ఓ పరిణామం పోలీసులకు షాక్ గా మారింది. ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఆరుగురు మహిళలు

ఆరుగురు మహిళలు

అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. అతని మృతదేహాన్ని ఇంటికి తరలించగా.. భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అంతలో మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. మా ఆయన అంటే..కాదు మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న వారు..

అతడి భార్యలమని

అతడి భార్యలమని

పోలీసుల ఎంట్రీతో కాస్త తగ్గారు. వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక.. అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే..ఒక వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు మహిళలు ఆందోళనకు దిగడం.. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులే కాదు స్థానికులు సైతం విస్మయానికి గురయ్యారు. ఇలా..చచ్చి వారి చేతిలో బతికిపోయాడన్న మాట అంటూ నిట్టూర్చారు. కానీ, చనిపోయే దాకా ఏకంగా ఏడుగురిని ఎలా మేనేజ్ చేసాడనేది కూడా ఆసక్తి కర చర్చ సాగుతోంది.

English summary
A driver committed suicide in Haridwar. at that time one by one totally seven ladies come out as his wives. They fight for husbabd dead body. This case caused challenge for local police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X