వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సీఎం నువ్వానేనా, తెరమీదకు కొత్త పేరు, గవర్నర్ కు మనవి, నేనే కరెక్ట్ !

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కోసం బీజేపీ, శివసేన పార్టీలు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్న సమయంలో ఆ పదవి రేసులోకి మరో వ్యక్తి వచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించి మహారాష్ట్రను మరింత అభివృద్ది చెయ్యడానికి తనకు అవకాశం ఇవ్వాలని శ్రీకాంత్ విష్ణు మనవి చేశారు.

ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!ప్రధాని విమానాన్ని అడ్డుకున్న పాక్: మీకు ఏం పోయేకాలం వచ్చిందో చెప్పండి: ICAO!

 మంచి రైతు

మంచి రైతు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వాడ్కౌలి ప్రాంతంలో శ్రీకాంత్ విష్ణు నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ విష్ణు రైతు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి శ్రీకాంత్ లేఖ రాశారు. తాను మంచి రైతుగా గుర్తింపు తెచ్చుకున్నానని శ్రీకాంత్ విష్ణు గవర్నర్ కు రాసిన లేఖలో వివరించారు.

ఒకేఒక్క చాన్స్ !

ఒకేఒక్క చాన్స్ !

బీజేపీ, శివసేన నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత వరకూ, సీఎం కుర్చీ ఎవ్వరికి ఇవ్వాలి అనే విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకూ తనను ముఖ్యమంత్రిని చెయ్యాలని శ్రీకాంత్ విష్ణు గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి మనవి చేశారు.

రైతుల సమస్యలు

రైతుల సమస్యలు

తాను ఓ రైతు, రైతుల సమస్యలు ఏలా ఉంటాయో తనకు బాగా తెలుసు అని శ్రీకాంత్ విష్ణు అంటున్నారు. రైతుల సమస్యలు అన్నీ పరిష్కరించాలంలే తనను ముఖ్యమంత్రి చెయ్యాలని శ్రీకాంత్ విష్ణు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీకి మనవి చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు !

ప్రభుత్వం ఏర్పాటు !

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2019 అక్టోబర్ 21వ తేదీ జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 24వ తేదీ ప్రకటించారు. 105 స్థానాల్లో బీజేపీ, 56 స్థానాల్లో శివసేన పార్టీ విజయం సాధించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే మ్యాజిక్ ఫిగర్ 145.

 కొత్త సమస్య !

కొత్త సమస్య !

మహారాష్ట్రలో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీ అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయింది. శివసేన మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయితే శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం 50.50 ఫ్మార్ములా తెరమీదకు తీసుకురావడంతో కొత్త సమస్య ఎదురైయ్యింది. సీఎం కుర్చీ కోసం బీజేపీ, శివసేన నువ్వానేనా అని పోటీ పడుతుంటే ఇప్పుడు శ్రీకాంత్ విష్ణు తెరమీదకు వచ్చారు.

English summary
Mumbai: A Farmer From Maharashtra Requests Governor To Make Him Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X