వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లలిత్ మోడీ మెడకు రెడ్ కార్నర్ నోటీసు ఉచ్చు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మెదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతనిని అరెస్టు చెయ్యడానికి ఈడీ అన్ని కోణాలు పరిశీలిస్తున్నది. లలిత్ మోదీ ఈడీ నుండి తప్పించుకోలేరని అధికారులు అంటున్నారు. ఈ స్థితిలోనే లలిత్ మోడీని భారత్ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ నుండి బహిష్కరణకు గురైన లలిత్ మోడీ తప్పించుకుని తిరుగుతున్నాడు. లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీని భారత్ రప్పించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రయత్నిస్తున్నారు.

లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చెయ్యాలని ఈడీ సీబీఐ అధికారులను కోరింది. ఈ విషయంపై సీబీఐ అధికారులు ఇంటర్ పోల్ ను సంప్రదిస్తున్నారు. త్వరలో లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

A former commissioner of the Indian Premier League Lalit Modi Case

మనీలాండరింగ్ కేసులో ఇటివల ప్రత్యేక కోర్టు లలిత్ మోడీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ అవకతవకలకు పాల్పడిన లలిత్ మోడీ మీద ఈడీ కేసులు నమోదు చెయ్యడంతో అతను 2012 లో లండన్ పారిపోయాడు.

అప్పటి నుండి భారత్ కు తిరిగిరాలేదు. ఈడీ అధికారుల దర్యాప్తుకు సహకరించలేదు. తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పలు ట్విట్ లు చేసి వారిని ఇరకాటంలో పెట్టాడు. లలిత్ మోడీ అరెస్టు అయితే ఎంత మంది నాయకుల బండారం బయటపడుతుందో వేచి చూడాలి.

English summary
former commissioner of the Indian Premier League (IPL), for non-compliance of the summons issued by the agency, according to ED sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X