బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోరం మాల్ ముందు న్యాయమూర్తిని దూషించిన సెక్యూరిటీ, ఆటో డ్రైవర్, మాతోపెట్టుకుంటే, చివరికి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నిత్యం రద్డీగా ఉంటుంది. వాహనాల పార్కింగ్ చెయ్యడానికి నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక షాపింగ్స్ మాల్స్, మల్టీఫెక్స్ దగ్గర రద్దీ ఎలాగుంటుందో అర్దం అవుతోంది. ఇక ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం గురించి చెప్పనవసరం లేదు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులు కారులో కుర్చోవడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయ్యిందని ఆరోపిస్తూ ఓ సెక్యూరిటీ గార్డు, ఆటో డ్రైవర్ రెచ్చిపోయారు. కారులో ఉన్నది ఎవరు ? అనే విషయం గుర్తించకుండా మాతోపెట్టుకుంటే మీ కథ అంతే అంటూ నానా హంగామా చేసి చివరికి జైలుపాలైనారు.

న్యాయమూర్తి నాగరత్న కుటుంబ సభ్యులు నవంబర్ 29వ తేది కోరమంగలలోని ఫోరం మాల్ కు వెళ్లారు. ఫోరం మాల్ లో షాపింగ్ ముగించుకున్న న్యాయమూర్తి నాగరత్న కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల సమయంలో మాల్ నుంచి బయటకు వచ్చారు.

A Forum mall security guard and auto driver arrested abusing judge in Bengaluru

ఆ సందర్బంలో న్యాయమూర్తి నాగరత్న కుటుంబ సభ్యుల వెంట ఓ వికలాంగుడు ఉన్నారు. ఫోరాం మాల్ బయట నిలిపి ఉన్న కారులో న్యాయమూర్తి నాగరత్న కుటుంబ సభ్యుల వెంట ఉన్న వికలాంగుడు కారులో కుర్చోవడానికి కొన్ని సెకన్లు ఆలస్యం అయ్యింది.

ఆ సందర్బంలో కోపం పెంచుకున్న ఫోరం మాల్ సెక్యూరిటీ గార్డు రాజు, ఆటో డ్రైవర్ వెంకటేష్ రెచ్చిపోయారు. ఎంత సేపు కారు అడ్డంగా పెడతారు. ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతే ఏం చెయ్యాలి అంటూ నానా హంగామా చేశారు. న్యాయమూర్తి నాగరత్నతో పాటు వారి కుటుంబ సభ్యులను దూషించారు.

వికలాంగుడు కారులో కుర్చోవడానికి కొంచెం ఆలస్యం అవుతోందని, అందుకే మీరు దూషించకూడదని న్యాయమూర్తి నాగరత్న కుటుంబ సభ్యులు మనవి చేశారు. ఆ సమయంలో రెచ్చిపోయిన సెక్యూరిటీ గార్డు రాజు, ఆటో డ్రైవర్ వెంకటేష్ మీరు ఏమనుకుంటున్నారు ? మాతోపెట్టుకుంటే మీ అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.

తరువాత ఇంటికి వెళ్లిపోయిన న్యాయమూర్తి నాగరత్న బెంగళూరు సిటి సివిల్ కోర్టు న్యాయస్థానంలో ఫిర్యాదు చెశారు. న్యాయమూర్తి నాగరత్న ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి రాజు, వెంకటేష్ లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
An auto driver and Forum mall security guard were arrested following allegation of abusing Bangalore ACMM court judge on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X