వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో... కోరిక తీర్చుకునేందుకు వచ్చిన పోలీసే ఆపద్బాంధవుడు...

|
Google Oneindia TeluguNews

ఆమె ఓ పేదింటి బిడ్డ. పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబ భారాన్ని పసి వయసులోనే భుజాలకెత్తుకుంది. అలా కష్టాలకు ఎదురీతున్న సమయంలోనే ఆమె ఓ ఊహించని ఉచ్చులో చిక్కుకుపోయింది. పరిచయస్తురాలు చేసిన మోసానికి వ్యభిచార గృహంలో బంధీగా మారింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఆ ఉచ్చు నుంచి విముక్తి పొందింది. ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ప్రచురించిన ఆమె కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్యాక్టరీ మూతపడటంతో పని లేక...

ఫ్యాక్టరీ మూతపడటంతో పని లేక...


'నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న చనిపోయారు. అమ్మ అనారోగ్యం బారినపడింది. దీంతో తల్లిని,చెల్లిని పోషించే భారం నాపై పడింది. ఆ క్రమంలో కోల్‌కతాలోని ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాను. అయితే కొన్నాళ్లకు ఫ్యాక్టరీ మూతపడటంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అలాంటి తరుణంలో నాతో పాటు రోజూ రైళ్లో ప్రయాణించే కకోలి విశ్వాస్ అనే మహిళ హల్దియాలో నాకో జాబ్ ఆఫర్ చేసింది. ఓరోజు ఆమెతో పాటు హల్దియాకు బయలుదేరాను.' అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించిన కథనంలో బాధితురాలు పేర్కొన్నారు.

కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో...

కళ్లు తెరిచేసరికి వ్యభిచార గృహంలో...

'ఆరోజు నేను చాలా థ్రిల్ అయ్యాను. మార్గమధ్యలో ఆమె ఓచోట నాకు టీ,కేక్ ఇచ్చింది. అవి తీసుకున్న కొద్దిసేపటికే నేను స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచే చూసేసరికి పుణే నగరంలో ఉన్న ఓ ఇంట్లో ఉన్నాను. అక్కడ దాదాపు 30 మంది అమ్మాయిలు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే... నన్ను బడీ దీదీకి అమ్మేశారని చెప్పారు. నేనింకా నోరు విప్పకముందే... నువ్వు ప్రతీరోజూ ఇక్కడకు వచ్చే అబ్బాయిలతో పడకను పంచుకోవాలని బడీ దీదీ చెప్పింది.' అని బాధితురాలు చెప్పారు.

తప్పించుకునే మార్గం లేక...

తప్పించుకునే మార్గం లేక...

'బడీ దీదీ చెప్పినట్లు చేసేందుకు నేను తిరస్కరించడంతో నన్ను ఓ గదిలో బంధించి ఇనుప రాడ్డుతో దాడి చేసింది. అలా నేను ఒప్పుకునేంతవరకూ రెండు నెలల పాటు నన్ను చిత్రహింసలకు గురిచేసింది. ఆ తర్వాత ప్రతీరోజూ ఉదయం 7గంటల నుంచి రాత్రి 11గంటల వరకు 10-12 మంది మగవాళ్లతో వ్యభిచారం. ప్రతీ రాత్రి అమ్మను తలుచుకుని ఏడ్చేదాన్ని. అక్కడినుంచి బయటపడేందుకు నాకు ఏ మార్గం లేకుండా పోయింది.ఓరోజు ఓ విటుడి ఫోన్ నుంచి మా మామయ్యకు ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ బడీ దీదీ నన్ను పట్టేసింది.' అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పోలీస్ సహాయంతో... ఆరేళ్ల తర్వాత విముక్తి...

ఆ పోలీస్ సహాయంతో... ఆరేళ్ల తర్వాత విముక్తి...


'అలా కొద్ది నెలలు గడిచిన తర్వాత... నా దగ్గరకు వచ్చే విటుల్లో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలుసుకున్నాను. ఆయన అక్కడికి వచ్చినప్పుడు సహాయం చేయమని కోరాను. అందుకు ఆయన నాకు చాలా సహాయం చేశారు. నన్ను తనతో పాటు తీసుకెళ్లి తిరిగి వ్యభిచార గృహంలో దిగబెడుతానని బడీ దీదీతో చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. దీంతో నన్ను తనతో పాటు బయటకు తీసుకొచ్చిన ఆ పోలీస్ అధికారి నేరుగా రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి కోల్‌కతా రైలు టికెట్ చేతిలో పెట్టారు. అంతేకాదు,రూ.3వేలు ఇచ్చారు. అలా ఆరేళ్ల తర్వాత నేను ఇంటికి చేరుకుని మా అమ్మను కలుసుకోగలిగాను.' అని చెప్పుకొచ్చారు.

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
ఎన్‌జీవో ప్రోత్సహంతో మళ్లీ భవిష్యత్‌పై ఆశలు...

ఎన్‌జీవో ప్రోత్సహంతో మళ్లీ భవిష్యత్‌పై ఆశలు...


పుణే నుంచి కోల్‌కతా వచ్చాక కూడా నేను నాలుగు గోడల మధ్యే ఉండిపోయాను. ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. ఓ ఎన్‌జీవో నన్ను ప్రోత్సహించడంతో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్ల సహకారంతోనే ఓ ఎంబ్రాయిడరీ ఫ్యాక్టరీలో పనికి కుదిరాను. ఏదో రోజు నా తల్లికి సొంతిల్లు కొనాలనేది నా కల. ఇప్పటికీ గాయాలు బాధిస్తున్నాయి. అయితే నా భవిష్యత్తు పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అలాగే నాలాగా అన్యాయానికి గురవుతున్న అమ్మాయిల కోసం నావంతుగా ఏదైనా చేయాలనుకుంటున్నాను.' అని బాధితురాలు వెల్లడించారు.

English summary
a woman's Facebook post expressing the brutal assault that she had gone through has gone viral on social media. The post was published on the Facebook page of 'Humans of Bombay' in which, the woman from the Indian state of West Bengal has described the events that happened in her life after she had lost her father at the age of 10. The news is doing the rounds on online platforms, and social media users are praising for her courage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X