• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూ ఇయర్ పార్టీకి డబ్బులు ఇవ్వలేదని , అమ్మమ్మను సుత్తితో కొట్టి చంపిన మనవడు

|

నూతన సంవత్సర పార్టీకి డబ్బులు ఇవ్వమని అడగడంతో, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన 73 ఏళ్ల అమ్మమ్మను సుత్తితో తలపై బాది దారుణంగా హత్య చేశాడు ఓ మనవడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటనలో కేవలం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డబ్బులు ఇవ్వని కారణంగా కోపంతో అమ్మమ్మని హతమార్చి డబ్బు దొంగిలించి పరారయ్యాడు ఓ కసాయి మనవడు .

 ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి.. ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..

అమ్మమ్మను సుత్తితో కొట్టి హతమార్చిన మనవడు

అమ్మమ్మను సుత్తితో కొట్టి హతమార్చిన మనవడు

ఢిల్లీలోని షాహదర ప్రాంతంలో ఒక వృద్ధురాలు మృతిపై పోలీసులకు అందిన సమాచారంతో పోలీసులు స్పందించారు. ఒక వృద్ధ మహిళను సుత్తితో తలపై బాదగా తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందినట్లుగా సంఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు గుర్తించారు. సతీష్ జాలీ అనే 73 ఏళ్ల వృద్ధ మహిళ కుర్చీలో తీవ్ర రక్తస్రావంతో విగతజీవిగా పడి ఉంది. నెత్తుటి మడుగులో సుత్తి ఉంది . అలాగే నేలపై రక్తపు మరకలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు డబ్బుల కోసం మనవడి దారుణం

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు డబ్బుల కోసం మనవడి దారుణం


సతీష్ జాలీ షాహదర రోహ్తాష్ నగర్ లోని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్నారు. ఆమె పెద్ద కుమారుడు సంజయ్ తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో ఫస్ట్ ఫ్లోర్ లో నివసిస్తున్నారు. ఆమె రెండవ కుమారుడు మనోజ్ ఆ ఇంటికి సమీపంలో వేరే చోట నివసిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి 8 గంటల సమయంలో నిందితుడు కరణ్ - సతీష్ జాలీ పెద్ద కొడుకు , కొడుకు తన అమ్మమ్మను తనకు డబ్బు కావాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో, అతను ఆమెను చంపి, రూ. 18,000 దొంగిలించి పారిపోయాడు.

ఇంట్లో రక్తపు మడుగులో తల్లి .. హత్య చేసింది ఎవరో తెలీని కొడుకులు

ఇంట్లో రక్తపు మడుగులో తల్లి .. హత్య చేసింది ఎవరో తెలీని కొడుకులు

కరణ్ కూడా అప్పుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని తండ్రి రోహ్తాష్ నగర్ లో కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం ఉదయం సతీష్ జాలీ కొడుకు మెట్లమీదకు వచ్చి తన తల్లి గది తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించి, తన సోదరుడిని పిలిచి చెప్పకుండా ఎక్కడికి వెళ్లింది అర్థం కావడం లేదని వెతకడం ప్రారంభించారు. మళ్ళీ అనుమానం వచ్చి ఇద్దరూ తమ తల్లిని వెతకడానికి ఇంటి తాళం తెరిచారు.

అక్కడ తల్లి చనిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో వారికి అంతు చిక్కలేదు .

 మనవడే హంతకుడని తేల్చిన పోలీసులు .. కోపంలో కొట్టానన్న మనవడు

మనవడే హంతకుడని తేల్చిన పోలీసులు .. కోపంలో కొట్టానన్న మనవడు


అయితే పోలీసుల దర్యాప్తులో, సతీష్ జాలీ మనవడు కరణ్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు . భవనంలోని అద్దెదారు నుండి సుత్తిని అడిగి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తన తండ్రి ఫోన్ చేసి తిరిగి రావాలని ఆదేశించడంతో తిరిగి వచ్చిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు .యుపికి చెందిన మీరట్ లోని ఒక కాలేజీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న విద్యార్థి అయిన కరణ్ పోలీసులతో తన అమ్మమ్మ తనకు తరచూ డబ్బు ఇచ్చేదని, అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డబ్బులు అడిగినప్పుడు ఇవ్వనని చెప్పడంతో కోపంగా ఉన్నానని, ఆ కోపంలో కొట్టానని చెప్పాడు. కేవలం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో క్షణికావేశంలో అమ్మమ్మ ప్రాణాలనే తీసి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.

English summary
A 19-year-old man has been arrested for allegedly murdering his 73-year-old grandmother - by hitting her on the head with a hammer - after she refused to give lend him money for a New Year's party, Delhi Police said on Monday.On Sunday night police responded to a distress call from a home in east Delhi's Shahdara neighbourhood. They were told an elderly woman had been hit on the head with a hammer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X