వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికొడుకు ఇంటివద్ద... మండపంలో ఆయన చెల్లెలు..గుజరాత్ వెరైటీ సాంప్రదాయం

|
Google Oneindia TeluguNews

పెళ్లంటే భాజ భజంత్రీలు, చుట్టాలు, ఇళ్లంతా సందడిసందడిగా ఉంటుంది. ఇక పెళ్లిమండపంలో మాత్రం పెళ్లికొడుకు, పెళ్లికూతురే స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటారు. ఇక హిందు సాంప్రదాయంలో అయితే తాళీ కట్టడాలు, తలంబ్రాలు పోయడాలు లాంటీ తంతు ఉంటుంది. ఇక మొత్తం పెళ్లితంతు అంతా పెళ్లికొడుకు ,పెళ్లి కూతురు మధ్య కొనసాగుతాయి. అయితే గుజరాత్‌లో మాత్రం పెళ్లికొడుకు లేకుండానే ఈ తతంగమంతా కొనసాగుతుంది. పెళ్లి కొడుకు బదులు ఆయన చెల్లెలు,లేదా ఆడపడుచులు దీన్ని కొనసాగిస్తారు.

దేశంలో పలురకాల పెళ్లిల్లు...

దేశంలో పలురకాల పెళ్లిల్లు...

భారత దేశంలో పెళ్లిలు ఓక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతాయి. ఎవరి సాంప్రదాయలకు అనుగుణంగా వారి పెళ్లిళ్లు జరుగుతాయి. దేశంలోని కొన్ని వర్గాల్లో మాత్రం సాంప్రదాయాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా జరిగే మెజారీటీ పెళ్లి సాంప్రదాయాలకు సంబంధం లేకుండా అవి కొనసాగుతాయి.కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు అబ్బాయిలకు తాళీకట్టి పెళ్లిల్లు చేసుకుంటారు. మరికొన్ని చోట్ల పెళ్లికొడుకు ముఖం కనబడకుండా పెళ్లిల్లు జరుగుతాయి.ఈనేపథ్యంలోనే గుజరాత్ సాంప్రదాయంలో అయితే చాల రాజుల పాటు ఈ తంతు జరుగుతాయి.

పెళ్లికొడుకు బదులు ఆయన చెల్లేలు తాళికడుతుంది

పెళ్లికొడుకు బదులు ఆయన చెల్లేలు తాళికడుతుంది

అయితే ఏ పెళ్లిలో అయినా పెళ్లికొడుకు, పెళ్లి కూతురు మాత్రం తప్పకుండా ఉంటారు. వీళ్లు లేకుండా పెళ్లిల్లు జరగడం అనేది పురాణాల్లో చెప్పుకున్నట్టు పెళ్లికుమారుడికి బదులు కత్తిని పెట్టి పెళ్లి చేసుకునేవారు. అయితే గుజరాత్‌లో మాత్రం పెళ్లి కోడుకు లేకుండా పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాంప్రదాయ ప్రకారమే పెళ్లి తంతు ముగిస్తారు. కాని విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు స్థానంలో మరో పెళ్లికాని పెళ్లికొడుకు చెల్లేలు ఉంటుంది.

పెళ్లి నుండి ఊరేగింపు దాక పెళ్లికాని ఆడపిల్లలే కీలకం

పెళ్లి నుండి ఊరేగింపు దాక పెళ్లికాని ఆడపిల్లలే కీలకం

గుజరాత్‌లోని సుర్కేఢ, సనాధ, మరయు అంబాల్ గ్రామాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. పెళ్లిమండపంలో పెళ్లికొడుకు బదులు పెళ్లి కొడుకు చెల్లెలు గాని,ఎవరైన ఆ కుటుంభానికి చెందిన మహిళలు పాల్గోంటారు. మహిళలే పెళ్లి తంతు అంతా కొనసాగిస్తారు. పెళ్లి అనంతరం ఊరేగింపు కూడ ఇద్దరు అడవాళ్ల మధ్య కొనసాగుతుంది. పూర్తిగా పెళ్లి కూతురును ఇంటికి తీసుకువచ్చేవరకు ఇంటి ఆడపిల్లలే ఈతంతును కొనసాగిస్తారు. ఇక వారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికొడుకుగా పూర్తిగా మేకప్ వేసుకుని డ్రేస్ చేసుకుని ఇంట్లోనే తల్లివద్ద కూర్చుంటారు.

సాంప్రదాయానికి విరుద్దంగా చేసుకుంటే కష్టాల పాలే...

సాంప్రదాయానికి విరుద్దంగా చేసుకుంటే కష్టాల పాలే...

ఇక ట్విస్ట్ ఏమిటంటే ఆ మూడు గ్రామాల్లో వీరి సాంప్రదాయానికి విరుద్దంగా కూడ కొంతమంది యువకులు పెళ్లి చేసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కాని వారు పెళ్లి అనంతరం చాల కష్టాలు ఎదుర్కొన్నారని,కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారని చెప్పారుత ఆ గ్రామ పెద్దలు.

English summary
some villages in gujarat an unususual trdition marriages takeplace whiyh out the groom's pysical presence. a groom cannot attend his own wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X