వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిని ఫక్కిలో పెళ్లికోడుకు కిడ్నాప్... పెళ్లి కూతురు ప్రియుడే కారకుడు...!

|
Google Oneindia TeluguNews

సమాజంలో కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతాయి. సినిమాల్లో చూపించినట్టు కోరుకున్న యువతి దక్కకపోతే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు తెరతీస్తారు కొందరు యువకుులు. యువతిని దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడతారు. అవరసమైతే యువతిని బలవంతంగానైన ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటారు. తమకు దక్కని యువతిని ఇంకేవరికి దక్కనీయకుండా చేస్తారు.

పెళ్లి కోడుకును ఎత్తుకెళ్లిన మరో పెళ్లికొడుకు

పెళ్లి కోడుకును ఎత్తుకెళ్లిన మరో పెళ్లికొడుకు

అయితే రాజస్థాన్‌లోని బార్‌మర్ జిల్లాలో మాత్రం ఇందుకు బిన్నంగా జరిగింది. పెళ్లి చేసుకోవడం కోసం ఓ మిస్సైన పెళ్లి కోడుకు తాను ఇష్టపడిన యువతి కోసం ఏకంగా పెళ్లి కోడుకునే ఎత్తుకెళ్లి పోయాడు. అనంతరం పెళ్లి కాకుండా అడ్డుకున్నాడు.రాజస్థాన్‌లోని బార్‌మర్ జిల్లాలో నగర్ గ్రామంలో జలాంసింగ్ అనే వ్యక్తితో అదే గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే కొద్ది రోజుల అనంతంరం నిశ్చితార్థం జరిగే సమయంలో యువతి తల్లిదండ్రులు రద్దు చేసుకున్నారు.

ఒకరితో ఎంగెజ్‌మెంట్ మరోకరితో పెళ్లి

ఒకరితో ఎంగెజ్‌మెంట్ మరోకరితో పెళ్లి

అనంతరం నర్ఫత్ సింగ్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయం చేయాలని నిర్ణయించారు. విషయాన్ని బయటకు తెలియకుండా బంధువుల మధ్యలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితం పెళ్లి జరగనున్నండగా ఇది గమనించిన మాజీ పెళ్లి కొడుకు తనను కాదని వేరే యువకుని పెళ్లి ఏర్పాట్లు చేయడం సహించలేక పోయాడు. దీంతో పెళ్లి కాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు.

అందుకే పెళ్లికోడుకు కిడ్నాప్

అందుకే పెళ్లికోడుకు కిడ్నాప్

దీంతో తన సోదరుడు, మరియు స్నేహితులతో పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న కొంతమంది అతిధులపై దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న పెళ్లి కోడుకు తోపాటు ఆయన సోదరున్ని అపహరించాడు. ఇక సంఘటనపై పెళ్లి కొడుకు తండ్రి పోలీసులకు పిర్యాధు చేశాడు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న మాజీ పెళ్లికోడుకు కిడ్నాప్ చేసిన వారిని వదలిపెట్టి పారిపోయాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

English summary
A man allegedly kidnapped a groom and his brother from a wedding in Bhata village of Barmer district.a groom kidnapped from a wedding in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X