వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం: మహిళా తహశీల్దార్ కు జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

ముంబై: లంచం తీసుకున్నారని రుజువు కావడంతో మహిళా తహశీల్దార్ కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. మహరాష్ట్రకు చెందిన సుప్రియా సుభాష్ భగ్వడే అనే మహిళ జైలు శిక్షకు గురైనారు.

మహారాష్ట్రలోని సతార్ జిల్లా కేంద్రంలో సుప్రియా తహశీల్దార్ గా ఉద్యోగం చేసేవారు. 2011 సెప్టెంబర్ 2వ తేదిన ఓ రైతు దగ్గర రూ. 21 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా చిక్కిపోయారు. మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.

A high-ranking woman revenue official has been sentenced to three years

అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడంతో గతంలో సుప్రియా ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది.

నాలుగు సంవత్సరాల తరువాత సుప్రియా రైతు దగ్గర లంచం తీసుకున్నట్లు న్యాయస్థానంలో రుజువు అయ్యింది. నేరం రుజువు కావడంతో సుప్రియాకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఐదు వేలు జరిమానా విధించారు. ఈ దెబ్బకు మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు.

English summary
Supriya Subhash Bagwade was caught red-handed while accepting a bribe of Rs 21,000 on September 2, 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X