బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటిలో ఒంటరిగా నవ వధువు, అనుమానాస్పద స్థితిలో శవమైంది, పంచాయితీలు, ఏం జరిగింది ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కుటుంబ సమస్యలతో విసిగిపోయిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైట్ ఫీల్డ్ రోడ్డులోని ఐటీపీఎల్ సమీపంలో నివాసం ఉంటున్న శిల్పా(27) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

హ్యాపీగా నవ దంపతుల కాపురం

హ్యాపీగా నవ దంపతుల కాపురం

బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే సమీపంలోని హిండిగనాళ గ్రామానికి చెందిన రామప్ప, దేవమ్మల కుమార్తె శిల్పాకు నాగేష్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నాగేష్, శిల్పా దంపతులు ఐటీపీఎల్ రోడ్డులోని హుడీలో నివాసం ఉంటున్నారు.

ఇంటిలో ఒంటరిగా శిల్పా !

ఇంటిలో ఒంటరిగా శిల్పా !

నాగేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో శిల్పా ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఇంటికి వచ్చి విషయం గుర్తించిన నాగేష్ శిల్పా కుటుంబ సభ్యులు, మహదేవపుర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అనేక అనుమానాలు

అనేక అనుమానాలు

మహదేవపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నాగేష్ ఇంటిలో ఎవరు లేని సమయంలో శిల్పా శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహం అయిన తరువాత కొన్ని నెలలు నాగేష్, శిల్పా దంపతులు అన్యోన్యంగా ఉన్నారని సమాచారం.

పెద్దల పంచాయితీలు

పెద్దల పంచాయితీలు

నాగేష్ కుటుంబ సభ్యులు పదేపదే శిల్పాను వేధింపులకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, పెద్దలు పంచాయితీలు చేశారని, అయినా నాగేష్, అతని కుటుంబ సభ్యులు శిల్పాను వేధింపులకు గురి చెయ్యడం వలనే ఇలా జరిగిందని శిల్పా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మహదేవపుర పోలీసులు తెలిపారు.

English summary
A housewife tired of harassing her husbands family has committed suicide by hanging herself.It was held at the Mahadevapur police station in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X