వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"హిందూ పాకిస్థాన్" వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. 2019 ఎన్నికల తర్వాత రెండవ సారి బీజేపీ ఎర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తు మరో హిందూ పాకిస్థాన్ ఏర్పడనుందని వ్యాఖ్యానించారు.

తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. గత సంవత్సరం జులైలో కోల్‌కతా నగరంలో నిర్వహించిన కార్యకర్యక్రమంలో పాల్గోన్న శశిథరూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం భారత దేశాన్ని మళ్లి అధికారంలోకి వస్తే హిందు పాకిస్తాన్ రూపాంతరం చెందబోతుందని వ్యాఖ్యానించారు.

A Kolkata court issued an arrest warrant against Congress mp Shashi Tharoor

మరోవైపు బీజేపి తన అధికారం ద్వార రాజ్యంగాన్ని తిరగరాసే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగడం ఆసాధ్యంగా కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజ్యంగాన్ని రూపుమాపి కోత్త రాజ్యంగాన్ని రూపోందిస్తారని అన్నారు. మహాత్మగాంధి, నెహ్రూ, సర్థార్ పటేల్‌తో పాటు, మౌలానా అజాద్‌లు దేశానికి స్వేచ్చ స్వాతంత్య్రాలు అందించారని,ఇందుకోసం అనేక పోరాటాలు చేశారని వ్యాఖ్యానించారు. ఇక తిరిగి అధికారంలో వస్తే బీజేపీ ప్రభుత్వం మైనారీటీ హక్కులను కాలరాయడంతోపాటు సరికొత్త హిందూ పాకిస్థాన్ దేశాన్ని సృష్టిస్తుందనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయనపై కోల్‌కతాలో సుమిత్ చౌదరీ అనే అడ్వకేట్ ఆయనపై పిర్యాధు చేశాడు. దీంతో కేసుకు సంబంధించి శశిథరూర్ హజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది.

English summary
A Kolkata court on Tuesday issued an arrest warrant against Congress parliamentarian Shashi Tharoor for a remark he had made last year regarding the formation of a ‘Hindu Pakistan’.A Metropolitan Magistrate court in the city issued the warrant against the Thiruvananthapuram MP, based on a case filed by Advocate Sumeet Chowdhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X