బెదిరించి వివాహితపై అత్యాచారం చేసిన స్వామిజీ అరెస్టు
భర్తను చంపేస్తానని, కొడుకును అనారోగ్యం పాలుజేస్తానని బ్లాక్ మెయిల్ చేసి ఓ స్వామిజీ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
చెన్నై:భర్తను చంపేస్తానని, కొడుకును అనారోగ్యం పాలుజేస్తానని బ్లాక్ మెయిల్ చేసి ఓ స్వామిజీ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
చెన్నై నగరంలోని అన్నామలై శిధార్ అలియాస్ అన్నాదురై అనే స్వామిజీ అన్నానగర్ లో ఆశ్రమం నెలకొల్పాడు. తనకు తీవ్ర తలనొప్పి సమస్యతో బాధపడుతున్నానని అమ్మమ్మతో కలిసి స్వామిజీ ఆశ్రమానికి ఒంటరిగా వచ్చింది.

అయితే మరునాడు వివాహితను స్వామిజీ ఒంటరిగా రావాలని కోరాడు. ఒంటరిగా ఆశ్రమానికి చేరుకొన్న వివాహితపై స్వామిజీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అభ్యంతరం తెలిపింది. దీంతో తన మంత్రశక్తితో కొడుకుకు పక్షవాతం వచ్చేలా చేస్తానని బెదిరించాడు.
తన మనుషులను పంపి భర్తను హత్య చేయిస్తానని ఆయన వివాహితను బ్లాక్ మెయిల్ చేశాడు. స్వామిజీ తనపై అత్యాచారం చేసిన విషయాన్ని బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నామలై శిధార్ స్వామిని పోలీసులు అరెస్టు చేసి ఆశ్రమాన్ని సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications