వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుత దాడులపై స్పందించని అటవీ శాఖ! చంపి... కోయ్యకు చెక్కిన జనం!

|
Google Oneindia TeluguNews

అస్సాం చరాయిడియో జిల్లాలోని గ్రామస్థులు చిరుత పులిని చంపి, గ్రామంలోని కోయ్యకు తగించారు. అనంతరం దాని గోళ్లను పీకేశారు. కాగా చిరుత గ్రామంలోని పలువురిపై దాడులు చేస్తుందని, దీంతో గ్రామస్థులు కలిసి మూకుమ్మడి నిర్ణయం తీసుకుని చిరుతను చంపివేశారు.
మరోవైపు చిరుత గ్రామంలో సంచరిస్తుందని చెప్పినా...అటవీ అధికారులు పట్టించుకోక పోవడంతో చిరుతపై దాడులు చేసి చంపివేశామని వారు చెబుతున్నారు.

చిరుత గత కొద్ది రోజుల క్రితం నీలేశ్వర్ గ్రామస్థుడిపై దాడి చేసి గాయ పరించింది. దీంతో ఆ గ్రామస్థుడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా నీలేశ్వర్ ను అస్సాంలోని దిబ్రుంగా మెడికల్ కాలేజీ చికిత్స పోందుతున్నాడు.ఇక చిరుత మనుష్యుల పై దాడులకు పాల్పడడంతో పాటు కొన్ని జంతువులపై కూడ దాడులు చేస్తోంది. దీంతో చాల జంతువులు చిరుత దాడికి బలయ్యాయి. ఈనేపథ్యంలోనే చిరుత దాడులతో గ్రామస్థుల్తో భయాందోనలు వ్యక్తం అవుతున్నాయి.

A leopard was killed by villagers in Assam.

అయితే చిరుత దాడులు చేస్తున్న విషయాన్ని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. కాని అటవీ శాఖ అధికారులు గ్రామస్థుల ఫిర్యాదు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వారు చెప్పారు. దీంతో వారే స్వయంగా చిరుతను చంపేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. కాగా రెండు సంవత్సరాల క్రితం కూడ ఇలాంటీ సంఘటన జరిగినట్టు గ్రామస్థులు తెలిపారు. ఓ చిరుత ఓ మహిళను దాడి చేసి చంపడంతో సుమారు వందమంది వరకు చిరుతపై దాడి చేసి చంపినట్టు చెప్పారు.

English summary
A leopard was killed this morning by villagers in Assam. They also gouged its eyes out and chopped off the paws after killing the animal that had critically injured a man in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X