వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీస్ హాస్టల్ లో లైంగిక వేధింపులు, భయంతో కేరళలో కూలిపని, సీసీ కెమెరాల్లో, కత్తి !

|
Google Oneindia TeluguNews

మైసూరు: కర్ణాటకలోని మైసూరు నగరంలోని కేఆర్ ఆసుపత్రి ఆవరణంలోని నర్సింగ్ కాలేజ్ లేడీఎస్ హాస్టల్ లో చొరబడి అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేసి వారి లోదుస్తులు లాక్కొని భయంతో కేరళకు పరారైన వికృత కామాంధుడిని కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, ఉప్పినంగడి పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల్లో నిందితుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

కత్తితో బెదిరించాడు

కత్తితో బెదిరించాడు

జులై 20వ తేదీ అర్దరాత్రి మైసూరు నగరంలోని కేఆర్ ఆసుపత్రి ఆవరణంలోని నర్సింగ్ కాలేజ్ లేడీఎస్ హాస్టల్ లోకి ఓ యువకుడు అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతన్ని కత్తితో బెదిరించి లేడీస్ హాస్టల్ లోపలికి వెళ్లాడు.

విద్యార్థులతో చెలగాటం

విద్యార్థులతో చెలగాటం

కేఆర్ ఆసుపత్రి నర్సింగ్ కాలేజ్ లేడీఎస్ హాస్టల్ లో చొరబడిన వికృత కామాంధుడు అమ్మాయిలను కత్తితో బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేశారు. అమ్మాయిలను లైంగికంగా వేధించిన తరువాత వారి లోదుస్తులు బలవంతంగా లాక్కొన్నాడు. కొందరు అమ్మాయిలు కలిసి అతని గొంతు నులమడానికి ప్రయత్నించడంతో అతను భయంతో అక్కడి నుంచి పరారైనాడు.

హడలిపోయారు

హడలిపోయారు

ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్న కేఆర్ ఆసుపత్రి నర్సింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో బెదిరించి అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో పలు ఆరోపణలు వచ్చాయి. లేడీస్ హాస్టల్ లోని అమ్మాయిలు హడలిపోయారు.

సీసీ కెమెరాలు

సీసీ కెమెరాలు

మైసూరు నగరంలోని దేవరాజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లేడీఎస్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు అధికారులు పరిశీలించారు. వికృత కామాంధుడు బంట్వాళ సమీపంలోని మణినాల్కూరు గ్రామానికి చెందిన మహమ్మద్ అల్తాఫ్ (23) అని పోలీసులు గుర్తించారు.

కేరళ తోటలో మకాం

కేరళ తోటలో మకాం

పోలీసులు పట్టుకుంటారని ఆందోళన చెందిన మహమ్మద్ అల్తాఫ్ కేరళలోకి కోట్టాయం జిల్లాలోని పుదుపెళ్లి లోని జినులాల్ అనే వ్యక్తి తోటలో కూలి పనికి చేరాడు. మహమ్మద్ అల్తాఫ్ కోసం ఇంత కాలం గాలించిన ఉప్పినంగడి పోలీసులు చివరికి కేరళలో అతను ఉన్నాడని గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే తాను కేరళ పారిపోయానని కామాంధుడు విచారణలో అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Uppinangady police arrested A man in connection to entering Mysuru K.R.Hospital students ladies hostel and steal women's inner wear. Accused identified as Mohammad Althaf, native of Bantwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X