వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 రోజుల్లోనే కోర్టు తీర్పు... చిన్నారీపై అత్యాచారం కేసులో రాజస్థాన్ కోర్టు సంచలనం

|
Google Oneindia TeluguNews

దిశ అత్యాచారం సంఘటన తర్వాత దేశంలో అనూహ్య మార్పులు చేసుచేసుకుంటున్నాయి. అత్యాచారం చేసిన నిందితులు సంవత్సరాల తరబడి చట్టాల్లో లోసుగులతో తప్పించుకుని తిరుగుతుండడంతో న్యాయ వ్యవస్థ నమ్మకం కోల్పోవడంతో పాటు, ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. దీంతో మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ వస్తుంది. ఈనేపథ్యంలోనే హైదారాబాద్ దిశ సంఘటనలో ఇదే జరిగింది. మరోవైపు నిర్భయ కేసులో ఏడు సంవత్సరాలు అవుతున్నా... ఇంకా వారికి శిక్ష అమలు కాకపోవడం కూడ ఇందుకు కారణమవుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లో అరుదైన తీర్పును కోర్టు వెలువరించింది. నాలుగేళ్ల బాలికపై జరిగిన అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి కేవలం 17 రోజుల్లోనే శిక్షను ఖారారు చేసింది. మొత్తం ఏడు రోజుల పాటు విచారణ జరిపి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. నవంబర్ 30న నాలుగేళ్ల చిన్నారీపై దయారం అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం క్రింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఈనెల ఏడున నిందితుడిపై చార్జీషీటు దాఖలు చేశారు.

A man convicted of raping case sentenced to death in just 17 days

ఈ కేసుపై న్యాయస్థానం రోజువారీ విచారణ జరిపింది. మేఘ్వాల్‌ను దోషిగా తేలుస్తూ పోక్సో చట్టం కింద జీవిత ఖైదు విధిస్తున్నట్లు మంగళవారం తీర్పు వెలువరించింది. కేవలం 17 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేశామని, శాస్త్రీయ ఆధారాలు ఈ కేసులో కీలక భూమిక పోషించాయని చురు ఎస్పీ తేజస్విని గౌతమ్‌ తెలిపారు. కాగా వరంగల్ లో ఇటివల జరిగిన కేసులో 24 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువరించింది. కాగా దిశ చట్టంలో కూడ కేవలం 21 రోజుల్లోనే శిక్షలు పడేలా జగన్ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే...

English summary
A man convicted of raping a four-year-old girl has been sentenced to death in just 17 days. The accused was sentenced to life imprisonment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X