వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్య - రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జమ్ము కాశ్మీర్ లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్‌కు చెందిన అరవింద్‌ కుమార్‌ షా(30) శ్రీనగర్‌లో ఓ ఈద్గా దగ్గర ఉన్నప్పుడు ఉగ్రవాది తుపాకీతో కాల్చాడు. అరవింద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. పుల్వామా జిల్లాలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంఘీర్‌ అహ్మద్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు.తెలిపారు. ఆ ఇద్దరి మరణంతో కశ్మీర్‌లో గత రెండు వారాల్లో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన మొత్తం పౌరుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కశ్మీర్‌లో నార్‌ ఖాస్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జేసీవో సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మొత్తం 9మంది సైనికులు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు జేసీవోలు ఉన్నారు. పూంఛ్‌, రాజౌరీ జిల్లాల్లో వారం రోజులుగా ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. కాగా పూంఛ్‌ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇద్దరు ఆర్మీ సిబ్బంది వీర మరణం పొందారు.

అమరుల్లో ఒక జవాన్‌తో పాటు జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీఓ) కూడా ఉన్నారు. జిల్లాలోని నార్‌ ఖాస్‌ అటవీ ప్రాంతంలో ముష్కరులు నక్కినట్లు సమాచారం అందడంతో గురువారం సాయంత్రం బలగాలు గాలింపు చేపట్టాయి. జేసీఓ యోగంబర్‌ సింగ్‌, జవాన్‌ విక్రమ్‌ అమరులయ్యారు. వారి భౌతికకాయాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఇటీవలే పూంఛ్‌ జిల్లాలో ఐదుగురు ఆర్మీ సిబ్బందిని హత్యచేసిన ముష్కరులే ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొని ఉండవచ్చని పేర్కొన్నారు.

A man from Bihar and another from Uttar Pradesh were killed in two back-to-back terror attacks in J&K

అలాగే పుల్వామా, శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. పుల్వామాలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అతడిని షాహిద్‌ బషీర్‌ షేక్‌గా గుర్తించారు. ఇక శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తంజిల్‌ అనే ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.

అలాగే శనివారం పుల్వామా జిల్లాలోని పాంపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ ట్వీట్‌ చేస్తూ 'మన సహచరులైన ఇద్దరు పోలీసులను గతంలో చంపిన ఉగ్రవాది ఉమర్‌ శనివారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడితోపాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు' అని పేర్కొన్నారు.

English summary
A street hawker from Bihar and a labourer from Uttar Pradesh were killed in two back-to-back attacks by terrorists in J&K .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X