వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.30 కోసం త్రిబుల్ తలాక్... ! కూరగాయాలు కొనేందుకు అడిగిన భార్యపై భర్త చిరాకు...!

|
Google Oneindia TeluguNews

ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ ఓ శాపంగా మారింది. భర్తలకు ఏ చిన్న కారణం దొరికినా...లేదంటే కోపానికి గురైన త్రిబుల్ తలాక్ చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక మహిళలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. తాజా ఓ సిల్లి రిజన్‌తో జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యకు త్రిబుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త,కూరగాయాలకు ముప్పయి రుపాయాలు ఇవ్వమన్నందుకు కోపగించుకున్నాడు...అనంతరం ఆమే పై దాడి చేసి త్రిబుల్ తలాక్ చెప్పాడు.

సిల్లి రీజన్‌తో త్రిబుల్ తలాక్

సిల్లి రీజన్‌తో త్రిబుల్ తలాక్

కూరగాయలు కొనేందుకు 30రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు ఓ భర్త.అంతేకాకుండా నన్నే డబ్బులు అడుగుతావా అంటూ భార్యను స్క్రూడ్రైవర్ తో కొట్టాడు.ఉత్తర ప్రదేశ్‌ నోయిడా సిటిలోని రావ్‌జీ మార్కెట్‌లో రెండు రోజుల క్రితం జరిగింది. నోయిడాలో ఉంటున్న సబీర్‌‌, జైనబ్ కు కొద్ది రోజుల క్రితం వివాహం అయింది. అయితే వివాహా అనంతరం సబీర్ భార్య వేధింపులకు గురి చేయడంతోపాటు హింసకు గురి చేసినట్టు ఆమే తల్లి దండ్రులు పిర్యాధులో పేర్కోన్నారు.ఈణేపథ్యంలోనే తరచు గొడవలు అవుతుండడంతో జైనబ్ తన పుట్టింటికి వెళ్లింది..తిరిగి గత శుక్రవారం భర్త ఇంటికి చేరుకుంది..

డబ్బులు అడుగుతావా అంటూ భార్యపై దాడి..

డబ్బులు అడుగుతావా అంటూ భార్యపై దాడి..

ఇక శనివారం ఇద్దరి మధ్య వాగ్వావాదం జరిగిందని కూరగాయలను తెచ్చేందుకు భర్తను ముప్పై రుపాయాలు అడిగింది..దీంతో విచక్షణ కొల్పోయిన భర్త తననే డబ్బులు అడుగుతావా అంటూ స్క్రూడ్రైవర్‌తో దాడి చేయడంతోపాటు విద్యుత్ షాక్ కూడ పెట్టాడు. ఆ వెంటనే ముఖం మీదే త్రిబుల్ తలాక్ చెప్పాడు. దీంతో విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే కూతురు వద్దకు వెళ్లారు..గాయాలతో ఉన్న జైనబ్‌ను ఆసుపత్రికి తరలించారు..అనంతరం తమ కూతురుని చిత్రహింసలకు గురి చేశారంటూ,సబీర్ తోపాటు అత్త,మామా, ఆడబిడ్డలపై జైనబ్ తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాధు చేశారు..

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు వరకట్న వేధింపులతోపాటు చిత్రహింసలకు గురి చేసిందుకు సబీర్‌తో పాటు ఆయన కుటుంభ సభ్యులపై కేసు నమోదు చేశారు.అనంతరం సబీర్ ‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.కాగా ఇతర కుటుంభ సభ్యులు పరారీలో ఉన్నట్టు స్టేషన్ హౌజ్ ఆఫిసర్ నీరజ్ మాలిక్ తెలిపారు.అయితే త్రిబుల్ తలాక్ చెప్పడంతోపాటు ఎలక్ట్ర్రిక్ షాక్ పెట్టారా లేదా అనే దానిపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

English summary
The police have booked a man for allegedly divorcing his wife by triple talaq following a heated argument over ₹30 in Greater Noida’s Dadri. According to the woman, her husband allegedly lost his cool, thrashed her and then divorced her when she asked him for ₹30 to buy vegetables.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X