వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 kidneys: ఏమీ విచిత్రం ఇదీ, వ్యాపారికి 3 కిడ్నీలు, అయినా హెల్తీగా..

|
Google Oneindia TeluguNews

శరీరంలో కిడ్నీ ఫంక్షనింగ్ ఇంపార్టెంట్.. అవును శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేసి.. మంచిని అందజేస్తోంది. సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. ఒకటి పాడయిన సరే.. మరొకటితో లైఫ్ లీడ్ చేయొచ్చు.. కొందరికీ రెండు పాడవడంతో.. డయాలసిస్ తప్పనిసరి అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం డయాలిసిస్ ఉచితంగానే అందజేస్తోంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒకరికీ ఏకంగా మూడు కిడ్నీలు ఉన్నాయి. స్కాన్ చేసిన వైద్యులు.. ఆశ్చర్యపోయారు. మరోసారి స్కాన్ చేసిన అంతే వచ్చింది.

వ్యాపారికి మూడు కిడ్నీలు

వ్యాపారికి మూడు కిడ్నీలు


ఉత్తరప్రదేశ్‌లో గల కాన్ఫూర్‌కు చెందిన వ్యాపారి సుశీల్ గుప్తాకు మూడు కిడ్నీలు ఉన్నాయి. మూడు కిడ్నీలు ఉన్నప్పటికీ సుశీల్ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. 2020లో తొలిసారిగా పిత్తాశయం ఆపరేషన్ కోసం అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి వచ్చిందట.. అప్పుడు విషయం బయటపడింది. మూడు కిడ్నీలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. వైద్యులు మళ్లీ అల్ట్రాసౌండ్ చేయించిన అంతే సంగతి.. శరీరంలో మూడు కిడ్నీలు సాధారణంగా పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు.

ఎడమవైపు రెండు కిడ్నీలు

ఎడమవైపు రెండు కిడ్నీలు


ఎడమవైపు రెండు కిడ్నీలు ఉండగా, కుడివైపు ఒక కిడ్నీ ఉందని వ్యాపారి సుశీల్ వివరించారు. నారాయణ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ రవికుమార్ ఏం జరిగిందో తెలియజేశారు. కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెండు కిడ్నీలు ఒక వైపునకు అభివృద్ధి చెందాయని, అందుకే అతనికి మూడు కిడ్నీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు అయితే ఓకే.. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కానీ జాగ్రత్తలు తప్పనిసరి

కానీ జాగ్రత్తలు తప్పనిసరి


సుశీల్ ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. ఇలాంటివారికి ఏదైనా ప్రమాదం జరిగితే కిడ్నీ దెబ్బతినే అవకాశాలున్నాయి. అలాంటివారు మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి క్రీడలు ఆడకూడదని తెలిపారు. అలా ఆడితే ప్రమాదం ఉందని అంటున్నారు. రెండు కిడ్నీలు ఓకేసారి దెబ్బతినే అవకాశం ఉందట.. సో ఇన్నాళ్లు మూడు కిడ్నీలు పనిచేసి... ఆ తర్వాత రెండు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పవట. కానీ మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు రావడం రేర్ అని వైద్యులే చెబుతున్నారు.

English summary
such cases are rare in the medical history. a man have three kidneys in his body. incident happened at uttar pradesh kanpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X